Kapil Sibal: బీజేపీ ప్రభుత్వానిది నియంతృత్వ ధోరణి: కపిల్ సిబల్

by S Gopi |

తాము ప్రజాస్వామ్య పక్షం ఉంటే, వారు నియంతృత్వానికి అధిపతిలా ప్రవర్తిస్తున్నారు.

Kapil Sibal: బీజేపీ ప్రభుత్వానిది నియంతృత్వ ధోరణి: కపిల్ సిబల్
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆరోపణలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో స్థిరాస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయడం ప్రజాస్వామ్యంపై దాడి అని ఆయన అభివర్ణించారు. తాము ప్రజాస్వామ్య పక్షం ఉంటే, వారు నియంతృత్వానికి అధిపతిలా ప్రవర్తిస్తున్నారు. బీజేపీ హిందూ-ముస్లిం ఎజెండాపై రాజకీయాలు చేయాలని, ప్రతిపక్షాన్ని అంతం చేయాలని చూస్తున్నారని ఆదివారం విలేకరుల సమావేశంలో కపిల్ సిబల్ అన్నారు. కాంగ్రెస్ నియంత్రణలో ఉన్న నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ విచారణలో భాగంగా అటాచ్ చేసిన రూ. 661 కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకోవడానికి నోటీసులు ఇచ్చినట్టు ఈడీ తెలిపిన నేపథ్యంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను బలహీనపరచాలనే లక్ష్యంతోనే పార్టీ ఆధ్వర్యంలో నడిచే వార్తాపత్రిక ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని, అందులో భాగంగానే నోటీసులు ఇచ్చినట్టు కపిల్ సిబల్ అన్నారు. కాంగ్రెస్‌కు చెందిన వాటిని ధ్వంసం చేసి, వాటి ఆస్తులను స్వాధీనం చేసుకుని, పార్టీ పనిచేయకుండా నిర్వీర్యం చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారు. ఇలాంటి చర్యల ద్వారా కాంగ్రెస్ పార్టీకి నిధుల కొరత సృష్టించి, రాజకీయ పార్టీగా కొనసాగకుండా చేయడమే బీజేపీ ఉద్దేశం. ఇది ప్రజాస్వామ్యంపై దాడి. ఇది దురదృష్టకరమైన సంఘటన, ప్రభుత్వ ధోరణిని ప్రతిబింబిస్తుందని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలను నాశనం చేయడానికి ఏజెన్సీలను ఉపయోగించే తీరు ప్రభుత్వ మనస్తత్వాన్నిన్ని ప్రతిబింబిస్తుందని సిబల్ చెప్పారు.

Next Story