సిద్ధరామయ్య సీఎం కావడం ఆనందంగా లేదు: డీకే సురేష్

by Disha Web Desk 12 |
సిద్ధరామయ్య సీఎం కావడం ఆనందంగా లేదు: డీకే సురేష్
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీ అనంతరం దాదాపు ఆరు రోజులు పాటు సీఎం ఎవరు అనే దానిపై చర్యలు జరిపారు. కాగా ఈ చర్చల్లో మాజీ సీఎం సిద్దరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. దీంతో సీఎంగా ఎవరిని నియమించాలే దానిపై కాంగ్రెస్ అధిస్టానం తీవ్రంగా కసరత్తు చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే ఇద్దరు నాయకులతో చర్చలు జరిపి సీనియర్ నాయకుడైన సిద్దరామయ్యను కర్ణాటక సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నారు.

అలాగే డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎంగా ఎన్నుకున్నారు. దీనిపై డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ గురువారం స్పందించారు. సిద్దరామయ్య కర్ణాటక సీఎంగా ప్రకటించడంపై తాను పూర్తిగా సంతోషంగా లేనని.. అన్నారు. అలాగే.. కర్ణాటక ప్రజల ప్రయోజనాల దృష్ట్యా శివకుమార్ ఈ నిర్ణయాన్ని అంగీకరించారని కాంగ్రెస్ ఎంపీ సురేష్ తెలిపారు. శివకుమార్‌కు సీఎం పదవి కావాలని నేను కోరుకున్నాను, అది జరగలేదు. దానికోసం కొంత కాలం వేచి చూద్దాం అని చెప్పుకొచ్చారు.


Next Story

Most Viewed