Video Viral:అందరికీ అతనిలా అదృష్టం ఉండదు.. వీసీ సజ్జనార్ వార్నింగ్!

by Jakkula.Mamatha |   (  Updated:2025-02-17 16:51:48  IST  )

ఐపీఎస్ అధికారి(IPS Officer), టీజీఎస్‌ఆర్టీసీ(TGSRTC) ఎండీ వీసీ సజ్జనార్(VC.Sajjanar) ప్రమాదాల పై మరోసారి ట్వీట్ చేశారు.

Video Viral:అందరికీ అతనిలా అదృష్టం ఉండదు.. వీసీ సజ్జనార్ వార్నింగ్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఐపీఎస్ అధికారి(IPS Officer), టీజీఎస్‌ఆర్టీసీ(TGSRTC) ఎండీ వీసీ సజ్జనార్(VC.Sajjanar) ప్రమాదాల పై మరోసారి ట్వీట్ చేశారు. ఆయన సామాజిక మాధ్యమాల్లో(Social Media) ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో పలు వీడియోలు షేర్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన 'అదృష్టవంతుడు.. రెప్పపాటులో బయటపడ్డాడు' అంటూ ట్విట్టర్ వేదికగా ఓ షాకింగ్ వీడియోను షేర్ చేశారు. చిన్నారులను రహదారుల వెంట తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

విషయంలోకి వెళితే.. తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పే వీడియో ఇది. ఓ తండ్రి బైక్ ఆపి ఉండగా చిన్నారి రోడ్డు పైకి పరిగెత్తుకొచ్చాడు. అదే సమయంలో అటువైపుగా వస్తున్న ఓ వ్యాన్ దూసుకెళ్లగా రెప్పపాటులో పిల్లోడు తప్పించుకున్నాడు. ఈ వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ షేర్ చేస్తూ అందరికీ ఈ బుడ్డోడిలా అదృష్టం ఉండదని అన్నారు.

ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న వారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ వీడియోలో ఓ పిల్లాడు రోడ్డు పైకి వెళ్తుండగా ఒక్కసారిగా లారీ దూసుకొస్తుంది.. వెంటనే పక్కన ఉన్న తండ్రి అలర్ట్ చేయడంతో తృటిలో దాని కింద పడకుండా తప్పించుకుంటాడు. తండ్రి ఒక్కసారిగా తల పట్టుకుని వణికిపోయాడు. అందుకే పిల్లలను బయటకు తీసుకెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎండీ సజ్జనార్ హెచ్చరించారు.

Next Story