Supreme Court: రాష్ట్రాలు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలి

by S Gopi |

కొన్ని సమస్యలను ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతి మధ్య పరిష్కరించుకోవాలని పేర్కొంది.

Supreme Court: రాష్ట్రాలు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలి
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతి సమస్యను సుప్రీంకోర్టు పరిష్కరించాల్సిన అవసరం లేదని, రాష్ట్రపతి సూచనలకు సంబంధించి మూడో రోజు విచారణ సందర్భంగా కేంద్రం తెలిపింది. కొన్ని సమస్యలను ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతి మధ్య పరిష్కరించుకోవాలని పేర్కొంది. కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కొందరు గవర్నర్లు బిల్లులను అలాగే ఉంచిన సమయంలో, న్యాయపరమైన పరిష్కారం కంటే రాజకీయ పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని వాదించారు. కొందరు గవర్నర్లు బిల్లులను ఆలస్యం చేస్తుంటే, అందుకు రాజకీయ పరిష్కారాలు ఉన్నాయి. దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఇది అన్ని రాష్ట్రాల్లో జరగడంలేదు. అలాగని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సుప్రీంకోర్టు వరకు వెళ్లడం లేదు. ముఖ్యమంత్రి వెళ్లి ప్రధానమంత్రికి చెబుతున్నారు. అక్కడి నుంచి రాష్ట్రపతిని కలుస్తారని కేంద్రం వివరించింది. బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి, గవర్నర్‌తో మాట్లాడి ఏదోక విధనా నిర్ణయం తీసుకోనివ్వమని ఫోన్ ద్వారా కూడా కోరే ప్రతినిధులు ఉన్నారు. గవర్నర్ బిల్లును ఎక్కువ కాలం పాటు నిలిపివేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉన్న ఎంపికల గురించి కోర్టు విచారణకు ప్రతిస్పందనగా తుషార్ మెహతా ఈ వ్యాఖ్యలు చేశారు.

Next Story