- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంజాబ్‌లో ఒక్క పేపర్ లీక్ కూడా జరగలేదు: సీఎం భగవంత్ సింగ్
పంజాబ్‌లో తమ ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లు పూర్తవుతోందని, ఈ కాలంలో ఒక్కటి కూడా క్వశ్చన్ పేపర్ లీక్ కాలేదని ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: నీట్ పేపర్ లీక్ అంశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాకు కీలక పాత్ర పోషించిన సీజేపీ పార్టీ పంజాబ్ రాష్ట్రంలో జరిగిన పేపర్ లీక్ అంశంపై కూడా నిరసనలు తెలపాలని దేశవ్యాప్తంగా డిమాండ్ మొదలైంది. దీంతో అప్రమత్తం అయిన పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఈ రోజు మీడియా ముందు వచ్చి రాష్ట్రంలోని పేపర్ లీక్ పై కీలక ప్రకటన చేశారు.
పంజాబ్‌లో తమ ఆప్ ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లు పూర్తవుతోందని, ఈ కాలంలో ఒక్కటి కూడా క్వశ్చన్ పేపర్ లీక్ కాలేదని ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ (Bhagwant Singh Mann) స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అయితే ఇటీవల రెండు ప్రాంతాల నుంచి కాపీయింగ్ (మాస్ కాపీయింగ్) రాయడానికి ప్రయత్నించినట్లు సమాచారం అందిందని, వెంటనే అధికారులు రంగంలోకి దిగి ఆ కుట్రను ఛేదించారని సీఎం వెల్లడించారు.
బ్లూటూత్ పెన్నుల ద్వారా ప్రశ్నాపత్రాలను డిజిటల్‌గా స్కాన్ చేసి బయటకు పంపి, ఆపై బయటి నుంచి సమాధానాలు పొందేందుకు ప్రయత్నించిన ముఠాను పోలీసులు పట్టుకున్నారని భగవంత్ మాన్ వివరించారు. పరీక్ష ప్రారంభమైన కేవలం 10 నిమిషాల్లోనే లోపల కాపీయింగ్ చేస్తున్న విద్యార్థులతో పాటు, ఒక్కో పేపర్‌కు రూ. 3 నుంచి 5 లక్షలు వసూలు చేస్తూ బయట నుంచి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న సూత్రధారులను కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో మొత్తం 21 మందిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు సీఎం వెల్లడించారు.






