- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Northeast: దశాబ్ద కాలం తర్వాత ఆకలి, పేదరికంలో మెరుగుపడిన ఈశాన్య రాష్ట్రాలు
నాగాలాండ్, మిజోరం, త్రిపుర నుంచి మూడు, సిక్కిం నుంచి ఒక జిల్లా ఎస్‌డీజీ సూచీలో చోటు దక్కించుకున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: నీతి ఆయోగ్, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. పేదరిక, ఆకలి నిర్మూలన, విద్య, లింగ సమానత్వం, ఎనిమిది రాష్ట్రాల ప్రజలకు స్వచ్ఛమైన నీరు, పారిశుధ్యం అందించడంలో ఈశాన్య ప్రాంతం మొత్తం మంచి పురోగతి సాధిస్తోంది. 2023-24 సంవత్సరానికి ఈశాన్య ప్రాంత స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సూచీలో ఈ ప్రాంతంలోని 121 జిల్లాల్లో సర్వే చేసిన 103 జిల్లాలు 'ఫ్రంట్ రన్నర్స్' గా నిలిచాయి. ఇది 2021-22 నుంచి గణనీయంగా పెరిగింది. ఆ సమయంలో సర్వే చేసిన 103 జిల్లాల్లో 62 శాతం అంటే 64 జిల్లాలు 'ఫ్రంట్ రన్నర్స్'గా ఉన్నాయి. ఈశాన్య ప్రాంతంలోని అచీవర్ జిల్లాలు 2021-22లో 12 నుంచి 26కి పెరిగాయని నివేదిక తెలిపింది. మొత్తంగా దశాబ్ద కాలం తర్వాత ఆకలి, పేదరికంలో ఈశాన్య రాష్ట్రాలు మెరుగుపడ్డాయని నివేదిక అభిప్రాయపడింది. ఈ ప్రాంతంలో అభివృద్ధి, పురోగతి ఆధారంగా జిల్లాలను అచీవర్స్ (లక్ష్యాన్ని చేరుకున్నవి), ఫ్రంట్ రన్నర్స్ (లక్ష్యాన్ని చేరుకోవడానికి దగ్గరగా ఉన్నవి), పెర్ఫార్మర్స్ (కొంత పురోగతిని చూస్తున్నవి), ఆస్పిరెంట్స్ (మరింత దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం) ఉన్న జిల్లాలుగా వర్గీకరించారు. పేదరికం, ఆకలి, పారిశుధ్యం వంటి విభాగాల్లో పురోగతిని అంచనా వేయడానికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ ఎస్‌డీజీ సూచీలో 84 అంశాలను పరిగణలోకి తీసుకుంది.
టాప్ 10లో నాగాలాండ్, మిజోరం, త్రిపుర
నాగాలాండ్, మిజోరం, త్రిపుర నుంచి మూడు జిల్లాలు, సిక్కిం నుంచి ఒక జిల్లా 2023-24 సంవత్సరానికి ఎస్‌డీజీ సూచీలో టాప్ 10 జిల్లాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ముఖ్యంగా, మిజోరం, త్రిపురలోని అన్ని జిల్లాలు 'ఫ్రంట్ రన్నర్స్'గా నిలిచాయి. నాగాలాండ్ లింగ సమానత్వం, స్వచ్ఛమైన నీరు, పారిశుధ్యం, మంచి పని, ఆర్థిక వృద్ధి వంటి అనేక అంశాల్లో మెరుగ్గా ఉంది. త్రిపురలోని ఎనిమిది జిల్లాలు అన్నీ ఫ్రంట్ రన్నర్స్, మౌలిక సదుపాయాలలో స్థిరమైన పురోగతిని చూపించాయి. సిక్కింలోని ఆరు జిల్లాలు ఫ్రంట్ రన్నర్స్, నాణ్యమైన విద్యలో మంచి పనితీరు కనబరిచాయి.






