North Korea: అలా చేస్తే సైనిక చర్యకు సిద్ధం.. అమెరికాకు ఉత్తర కొరియా వార్నింగ్

by B.Srinivas |

పశ్చిమాసియాలో ఇప్పటికే యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ నార్త్ కొరియా సంచలన వ్యాఖ్యలు చేసింది.

North Korea: అలా చేస్తే సైనిక చర్యకు సిద్ధం.. అమెరికాకు ఉత్తర కొరియా వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఇప్పటికే యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ నార్త్ కొరియా (North korea) సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికా (America), జపాన్ (Japan), దక్షిణ కొరియా (South korea) దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. తమకు వ్యతిరేకంగా ఏదైనా ముప్పు వాటిల్లినట్టు అయితే సైనిక చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించింది. భద్రతా ముప్పును ఎదుర్కోవడానికి దేనికైనా రెడీగా ఉంటామని తెలిపింది. ఉత్తర కొరియాను లక్ష్యంగా చేసుకుని భద్రతా భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవద్దని సూచించింది. జపాన్, దక్షిణ కొరియా, అమెరికాలు సంయుక్తంగా ఇటీవల వైమాణిక విన్యాసాలు నిర్వహించాయి. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా స్పందించి వార్నింగ్ ఇచ్చింది. కాగా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య నిరంతరం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Next Story