- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kashmir: కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు సహజంగా రాలేవు
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రం చెప్పినట్లుగా కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు సహజంగా లేవని జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా విమర్శించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రం చెప్పినట్లుగా కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు సహజంగా లేవని జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. షబ్-ఎ-బరాత్ సందర్భంగా శ్రీనగర్‌లోని జామియా మసీదు మూసివేయడం ద్వారానే కశ్మీర్‌లో భద్రతా పరిస్థితి ఏంటనేది తెలుస్తోందన్నారు. బలవంతపు చర్యలతో శాంతిభద్రతలు ఉన్నట్లు చూపిస్తున్నారని విమర్శించారు. భయంతో పరిస్థితులను కొంతకాలమే నియంత్రించగమని అన్నారు. అదే సహజంగానే సాధారణ పరిస్థితులు ఏర్పడితే.. అది శాశ్వతమని చెప్పుకొచ్చారు.
జామా మసీదు మూసివేతపై..
2010లో నిరసనల సమయంలో 200 మందికి పైగా యువకులు మరణించినప్పటి నుంచి ఇప్పటివరకు కశ్మీర్ లోని భద్రతా పరిస్థితుల్లో తేడాల గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఒమర్ ఈ విధంగా జవాబిచ్చారు. జమ్ముకశ్మీర్ లో సాధారణ పరిస్థితులే ఉంటే.. మీర్వాయిజ్ ఫరూక్ తన మామ నమాజ్-ఎ-జనాజాను నిర్వహించకుండా నిరోధించడానికి జామా మసీదును మూసివేసేవారు కాదన్నారు. శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని భయపడ్డారని అన్నారు. మరోవైపు, ఆర్టికల్ 370 రద్దు కారణంగా షట్‌డౌన్‌లు, వేర్పాటువాద, ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గాయని కేంద్రం పలుమార్లు ప్రకటించింది.






