- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Donald Trump: పరస్పరం పన్నులు విధించుకుంటున్నామని మోడీకి చెప్పా
పన్నుల విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన సంభాషణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయటపెట్టారు. టారీఫ్‌ల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని తాను మోడీతో వెల్లడించినట్లు చెప్పారు.

దిశ, నేషనల్ బ్యూరో: పన్నుల విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన సంభాషణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయటపెట్టారు. టారీఫ్‌ల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని తాను మోడీతో వెల్లడించినట్లు చెప్పారు. ఇటీవలే సుంకాల విషయంలో వీరిద్దరి మధ్య మీటింగ్ జరిగింది. ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్న ట్రంప్.. ఈ విషయాన్ని బయటపెట్టారు.‘‘ మనం ఇక్కడ ఏం చేయబోతున్నాం.. పరస్పరం పన్నులు విధించుకుంటున్నామని నేను ఇటీవలే మోడీకి చెప్పా. మీరు ఎంత ఛార్జి చేస్తే.. నేనూ అంతే విధిస్తా అని తెలిపా . ఇంతలో ఆయన ఏదో చెప్పబోయారు. వద్దు.. వద్దు .. నేను ఏం మాట్లాడను ఇక. ఎంత పన్నులు విధిస్తే.. అంతే తిరిగి ఛార్జి చేస్తా అని చెప్పా. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వాటిపై భారత్ కూడా అత్యధికంగా టారీఫ్ లు విధిస్తుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో ఇది చాలా ఎక్కువ. అమెరికా నుంచి దిగుమతయ్యే కార్లపై దాదాపు వంద శాతం సుంకాలు విధిస్తుంది.” అని ట్రంప్ అన్నారు. కాగా.. ట్రంప్ తో పాటే ఇంటరవ్యూలో ఉన్న మస్క్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. “అవును.. భారత్ ఆటో దిగుమతులపై వంద శాతం పన్ను విధిస్తుంది” అని మస్క్ అన్నారు.
నాతో ఎవరూ వాదించలేదు
కాగా.. మస్క్ వ్యాఖ్యలపై మరోసారి ట్రంప్ స్పందించారు. ‘‘ భారత్ విధించే ఆ టారీఫ్ లు చాలా చిన్నవి.. వాటిని మించిన సుంకాలు విధిస్తుంది. ఇతరులు కూడా అంతే. నేను 25 శాతం పన్నులు విధిస్తే.. అబ్బో అంత పన్నులు విధిస్తారా అని అంటున్నారు. అందుకే నేను ఇకపై అలా మాట్లాడను. వారెంత విధిస్తే.. మనమూ అంతే ఛార్జి చేస్తాం. నాతో ఎవరూ వాదించలేరు. అప్పుడే వారు సుంకాలను నిలిపేస్తారు.’’ అని వివరించారు. ఇకపోతే, ఆటో మొబైల్ రంగ ఉత్పత్తులపై అంత టారీఫ్ లు విధించడం అన్యాయం అని ట్రంప్ అన్నారు. అమెరికన్ కంపెనీలు భారత దేశంలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను స్థాపించకపోతే వాటిని అమ్మడం అసాధ్యమన్నారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ అని చెప్పుకొచ్చారు. పన్ను విషయంలో భారత్‌ను ట్రంప్ తప్పుపట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆయన ఇండియాను టారీఫ్ కింగ్ ని పిలిచేవారు. మరోవైపు, ఇటీవలే ప్రదాని మోడీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా భారత్-అమెరికా వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. అంతేకాకుండా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొనేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.






