15 ఏళ్ల లోపు పిల్లలకు నో సోషల్ మీడియా.. తీర్మానం ఆమోదించిన తొలి అరబ్ కంట్రీ

by Prasad Jukanti |   (  Updated:2026-06-18 12:24:09  IST  )

సామాజిక మాధ్యమాలు పిల్లలపై దుష్ప్రభావం చూపుతున్నాయన్నే ఆందోళనల నేపథ్యంలో సోషల్ మీడియాలపై ఆంక్షలు విధిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోంది.

15 ఏళ్ల లోపు పిల్లలకు నో సోషల్ మీడియా.. తీర్మానం ఆమోదించిన తొలి అరబ్ కంట్రీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: పిల్లలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్న సోషల్ మీడియాపై ఆంక్షలు (Social Media Ban) అమలు చేస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే తమ దేశంలోని టీనేజ్ పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా ఆస్ట్రేలియా, యూకే, కెనడా వంటి దేశాలు ఆంక్షలు అమలు చేస్తుండగా త్వరలో బ్రిటన్ కూడా త్వరలో ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆ జాబితాలో అరబ్‌ దేశం యూఏఈ (UAE) కూడా చేరింది. ఇకపై తమ దేశంలో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‍ల వినియోగానికి కనీస వయసును 15 ఏళ్లుగా నిర్ణయిస్తూ ఇవాళ యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీర్మానాన్ని ఆమోదించింది. ఇంతకంటే తక్కువ వయసు కలిగి ఉన్న పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‍లలో వ్యక్తిగత ఖాతాలను సృష్టించడం, ఉపయోగించడం లేదా నిర్వహించడం నిషేధించింది. తాజా నిబంధనలకు అనుగుణంగా తమ ప్లాట్ ఫామ్‍ల్లో మార్పులు చేసేందుకు ఆయా సోషల్ మీడియా కంపెనీలకు ప్రభుత్వం ఏడాది గడువు విధించింది. సోషల్‌ మీడియాతో పిల్లలకు పొంచి ఉన్న ముప్పును తప్పించడంతో పాటు ఆరోగ్యకరమైన డిజిటల్‌ వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు యూఏఈ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా తాజా తీర్మానంతో ఈ తరహా నిబంధన తీసుకొచ్చిన తొలి అరబ్‌ దేశంగా యూఏఈ నిలిచింది.

Next Story