Trump : పన్నుల పెంపులో తగ్గెదే లేదు : మోడీ ముందే ట్రంప్ స్పష్టీకరణ

by Y. Venkata Narasimha Reddy |

భారత్ సహా ఏ దేశంపైన అయినా పన్నుల విధింపు పెంపులో తగ్గేదే లేదని(No Reduction In Tax Hikes)అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)ప్రధాని మోడీ(Modi) ముందే తేల్చి చెప్పారు.

Trump : పన్నుల పెంపులో తగ్గెదే లేదు : మోడీ ముందే ట్రంప్ స్పష్టీకరణ
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ సహా ఏ దేశంపైన అయినా పన్నుల విధింపు పెంపులో తగ్గేదే లేదని(No Reduction In Tax Hikes)అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)ప్రధాని మోడీ(Modi) ముందే తేల్చి చెప్పారు. మోడీతో భేటీకి ముందు అన్ని దేశాలతో పరస్పర సుంకాల అమలు ఫైల్ పై సంతకం చేసిన ట్రంప్ రెసిప్రోకల్స్ టారిఫ్స్ అంటూ వ్యాఖ్యానించి తన అంతరంగాన్ని చెప్పకనే చెప్పారు. అదే క్రమంలో వైట్ హౌస్ లో ప్రధాని మోడీతో ట్రంప్ భేటీ అనంతరం ఉమ్మడి మీడియా సమావేశంలో విలేఖర్ల ప్రశ్నలకు వారు బదులిచ్చారు. ఈ సందర్భంగా భారత్ సహా ఇతర దేశాలపై విధిస్తున్న పన్నులను ట్రంప్ సమర్ధించుకొన్నారు.

భారత్ లేదా మరే దేశమైనా సరే.. మాపై తక్కువ పన్నులు విధిస్తే.. మేము కూడా అలానే టారిఫ్ లు వేస్తామని.. భారత్ మాపై ఎంత శాతం పన్ను విధిస్తే.. మేమూ అంతే చార్జి చేస్తామని.. వారి సుంకాలు ఎంత ఎక్కువన్నది ఇక మా సమస్య కాదని స్పష్టం చేశారు. నా తొలివిడత పాలనలో అధిక టారిఫ్ ల ఊరట కోసం ప్రయత్నించి ఆశించిన ఫలితం పొందలేదని... అందుకే ఇతర దేశాలు ఎంత పన్ను వేస్తే.. మేము అంతే ఛార్జి చేస్తామని... అమెరికా ప్రజల కోసం ఇదే సరైన చర్య అని ట్రంప్ స్పష్టం చేశారు. పన్నుల వ్యవహారంలో మాకు ఐరోపా అత్యంత సమస్యాత్మకమని.. ఎవరూ కనీవినీ ఎరుగని స్థాయిలో మాపై పన్నులు విధిస్తున్నారని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు.

ఇక చైనా మరింత ఎక్కువగా పన్నులు వేస్తుందని.. నేను అధికారంలోకి రాక ముందు కనీసం 10శాతం కూడా పన్ను విధించేవారు కాదన్నారు. నేను తొలిసారి పగ్గాలు చేపట్టినప్పుడు వారి నుంచి వందల బిలియన్ డాలర్లు పన్నుల రూపంలో వసూలు చేశామని.. మేము మాదేశం కోసం పన్నుల విధింపు ఎలా చేయాలో అలానే చేశామన్నారు. వైట హౌస్ లో అంతకుముందు మోడీ-ట్రంప్ పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. 2030 నాటికి ఇరు దేశాల వాణిజ్యం 500 బిలియన్ డాలర్ల దాటించే లక్ష్యంతో మిషన్-500ను ప్రకటించారు.

Next Story