ఇరాన్‌పై అణుదాడి ప్రసక్తే లేదు.. డొనాల్డ్ ట్రంప్ కీ స్టేట్‌మెంట్

by Kema Shiva Kumar |

ఇరాన్‌పై అణుదాడి చేసే ఆలోచన లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

ఇరాన్‌పై అణుదాడి ప్రసక్తే లేదు.. డొనాల్డ్ ట్రంప్ కీ స్టేట్‌మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌ (Iran)పై అణ్వాయుధాలను ప్రయోగించే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు. ఇవాళ ఆయన వైట్‌ హౌస్‌ (White House)లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..అణ్వాయుధాల వినియోగానికి ఎటువంటి సమర్థన లేదని, అసలు వాటిని ఎవరూ వాడకూడదని ఆకాంక్షించారు. వాటి అవసరం లేకుండానే, సాధారణ సైనిక దాడుల (Conventional Strikes) ద్వారా తాము ఇరాన్‌ను ఇప్పటికే కోలుకోలేని విధంగా దెబ్బతీశామని పేర్కొన్నారు. ఇరాన్ నౌకాదళం సముద్ర గర్భానికి చేరుకుందని, వారి వాయుసేన, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్, రాడార్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వివరించారు. ఆ దేశ నాయకత్వం కూడా చెల్లాచెదురైందని, దిగ్బంధం చాలా బలంగా ఉందని వ్యాఖ్యానించారు.

ఒప్పందంపై తొందరేం లేదు..

ఇరాన్‌తో చర్చల విషయంలో తానేమీ తొందరపడటం లేదని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కేవలం తాత్కాలిక పరిష్కారం కంటే అమెరికా (America) ప్రయోజనాలు, ప్రపంచ సుస్థిరతను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ఒప్పందంపైనే దృష్టి సారించినట్లుగా తెలిపారు. అయితే, ఇరాన్‌కు సమయం తక్కువగా ఉందని, పరిస్థితులు వారికి అనుకూలంగా లేవని హెచ్చరించారు. రెండు వారాల కాల్పుల విరమణ సమయంలో ఇరాన్ తన సైన్యాన్ని పునర్నిర్మించుకోవాలని చూసినా, దానిని నిమిషాల్లో అడ్డుకోగలమని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

Next Story