Maharashtra : నో పార్కింగ్.. నో కార్ : ముంబైలో కొత్త రూల్

by Muthe.Rajitha |   (  Updated:2025-05-21 14:11:08  IST  )

పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర సర్కార్(Maharashtra Govt) కీలక ప్రకటన జారీ చేసింది.

Maharashtra : నో పార్కింగ్.. నో కార్ : ముంబైలో కొత్త రూల్
X

దిశ, వెబ్ డెస్క్ : పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర సర్కార్(Maharashtra Govt) కీలక ప్రకటన జారీ చేసింది. ముంబైలో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ సమస్యలను అరికట్టేందుకు "నో పార్కింగ్, నో కార్"(NO Parking.. NO Car Rule) అనే కొత్త రూల్ ను తీసుకు వచ్చింది. ఈ నియమం ప్రకారం కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు ముందు సంబంధితఅధికారుల నుంచి పార్కింగ్ స్పేస్ ప్రూఫ్ సర్టిఫికేట్‌(Parking Space Proof Certificate)ను సమర్పించాల్సి ఉంటుందని రాష్ట్ర రవాణామంత్రి ప్రతాప్ సర్నైక్(Minister Pratap Sarnik) తెలిపారు.

ఈ నిర్ణయం ముంబై, పుణె, నాగ్‌పూర్‌తో సహా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్(MMR) పరిధిలోని 6,328 చదరపు కిలోమీటర్లలో అమలు కానుంది. ఇక్కడ 26 మిలియన్లకు పైగా జనాభా ఉండగా.. 47 లక్షలకు పైగా రిజిస్టర్డ్ వాహనాలున్నాయి. అందులో 14 లక్షల ప్రైవేట్ కార్లు ఉన్నాయి. కానీ వీటిలో చాలా వాహనాలకు వారి భవనాల్లో పార్కింగ్ సౌకర్యాలు లేవు. దీనివల్ల రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ఓపెన్ స్పేస్‌లు కార్లతో నిండిపోతున్నాయి. ఈ నియమం ద్వారా అనధికార పార్కింగ్‌ను నియంత్రించి, అత్యవసర సేవలైన అంబులెన్స్‌లు, ఫైర్ బ్రిగేడ్‌లకు అడ్డంకులను తొలగించవచ్చని ప్రభుత్వం పేర్కొంది.

ఈ విధానం సామాన్యులపై మరింత ఆర్థిక భారాన్ని కలిగించవచ్చని, ముఖ్యంగా పాత నివాస ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యాలు లేని వారికి ఇబ్బందులు తలెత్తవచ్చని విమర్శలు వస్తున్నాయి. అయితే పబ్లిక్ పార్కింగ్ లాట్‌లలో స్థలాలను అద్దెకు తీసుకునే అవకాశం ఉందని, అలాగే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, ముంబై మెట్రో, లోకల్ రైళ్ల వంటి సేవల వినియోగం పెరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

Next Story