కొత్త EPFO ఫారం ఇవ్వకపోతే పింఛను ప్రయోజనాలు ఆగిపోతాయా?: క్లారిటీ ఇచ్చిన కేంద్రం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-06-28 15:10:59  IST  )

పెన్షన్‌ ప్రయోజనాలు ఆగిపోతాయని ప్రచారమవుతున్న వార్తలపై కేంద్రం స్పందించింది.

కొత్త EPFO ఫారం ఇవ్వకపోతే పింఛను ప్రయోజనాలు ఆగిపోతాయా?: క్లారిటీ ఇచ్చిన కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: పెన్షన్‌ ప్రయోజనాలు ఆగిపోతాయని ప్రచారమవుతున్న వార్తలపై కేంద్రం స్పందించింది. జూలై 28 తర్వాత కొత్త ఈపీఎఫ్‌వో (EPFO) ఫారం సమర్పించకపోతే ఆగస్టు నుండి పెన్షన్‌ నిలిపి వేస్తామని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అత్యవసర నోటీసు జారీ చేసిందన్న వార్తలు అసత్యమని కేంద్ర ప్రభుత్వం ఖండించింది.

ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం స్పందిస్తూ.. ‘‘ఈ వార్తల్లో నిజం లేదు. ఎలాంటి కొత్త ఫారాన్ని EPFO విడుదల చేయలేదు’’ అని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఒక పోస్టు ద్వారా తెలియజేసింది. ప్రజలు నకిలీ వార్తల బారిన పడకూడదని, ఎలాంటి సమాచారం అయినా అధికారిక వర్గాల ద్వారా ధృవీకరించుకోవాలని పీఐబీ (PIB) సూచించింది.

Click For Twitter Post ...

Next Story