- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Air India: కూలిన విమానంలో ఎలాంటి నిర్వహణ లోపాలు లేవు: ఎయిర్ ఇండియా సీఈఓ
అంతేకాకుండా ప్రయాణానికి ముందు సాధారణంగా చేసే బ్రీత్ అనలైజర్ టెస్టింగ్‌లను కూడా ఇద్దరు పైలట్లు క్లియర్ చేశారని..

దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక నివేదికపై ఎయిర్ఇండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ స్పందించారు. సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. బోయింగ్ డ్రీమ్‌లైనర్ ఘోర ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తులో విమానం లేదా దాని ఇంజిన్లలో ఎటువంటి యాంత్రిక లేదా నిర్వహణ సమస్యలు లేవని అన్నారు. ఇంధన నాణ్యతలో ఎక్కడా లోపం కనిపించలేదు. టేకాఫ్ అయిన సమయంలో అసాధారణ పరిస్థితులు కూడా లేవు. అంతేకాకుండా ప్రయాణానికి ముందు సాధారణంగా చేసే బ్రీత్ అనలైజర్ టెస్టింగ్‌లను కూడా ఇద్దరు పైలట్లు క్లియర్ చేశారని, ఏఏఐబీ నివేదిక వారి హెల్త్ రిపోర్ట్‌కు సంబంధించి ఎలాంటి పొరపాట్లు జరగలేదు. అధికారుల నుంచి ఉన్న సూచనల ఆధారంగానే ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఏఏఐబీ ప్రాథమిక నివేదికలో ఉన్న విషయాల పట్ల ఇప్పటికిప్పుడు తుది నిర్ణయానికి రావొద్దని క్యాంప్‌బెల్ విల్సన్ కోరారు.
నివేదికలో ఎలాంటి స్పష్టమైన కారణాలను గుర్తించలేదు, ఎలాంటి సిఫార్సులు చేయలేదు. కాబట్టి అకారణ తీర్మాణాలు వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరిగిన రోజుల వ్యవధిలోనే ఎయిర్ఇండియా వద్ద ఉన్న మొత్తం 787 డ్రీమ్‌లైనర్ విమానాలను తనిఖీ చేశామని, అన్ని విమానాలు సేవలందించేందుకు అనుకూలంగా ఉనాయని కనుగొన్నట్టు చెప్పారు. వాటితో పాటు అన్ని విమానాలపై కావాల్సిన అన్ని తనిఖీలు నిర్వహిస్తాం. అధికారులు సూచించే కొత్త విమానాలకు కూడా తనిఖీలు చేసేందుకు సిద్ధంగా ఉంటామని ఎయిర్ఇండియా సీఈఓ పేర్కొన్నారు. కాగా, గతవారం విడుదలైన ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు చర్చకు వచ్చాయి. ఎలాంటి కుట్రకోణం లేదని, పక్షులు ఢీకొన్న గుర్తులేమీ లేవని తేలింది. అయితే, ఇంధనాన్ని కంట్రోల్ చేసే స్విచ్ ఆఫ్ కావడం వల్లనే ప్రమాదం జరిగిందనే అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో పైలట్ల పాత్రపై చర్చ పెరగడంతో ఇప్పుడే దానిపై నిర్ధారణకు రావడం సరైంది కాదని ఏఏఐబీ మాజీ చీఫ్ అరబిందో హాండా ప్రకటన జారీ చేశారు.






