కోవిడ్ వ్యాక్సిన్‌లతో గుండెపోటుకు సంబంధం లేదు..తేల్చేసిన ఎయిమ్స్, ఐసీఎంఆర్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-02 05:34:18  IST  )

కర్ణాటకలోని హసన్ జిల్లాలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంపై సీఎం సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

కోవిడ్ వ్యాక్సిన్‌లతో గుండెపోటుకు సంబంధం లేదు..తేల్చేసిన ఎయిమ్స్, ఐసీఎంఆర్
X

దిశ‌, వెబ్ డెస్క్: దిశ‌, వెబ్ డెస్క్: కర్ణాటకలోని హసన్ జిల్లాలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంపై సీఎం సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఒకే జిల్లాలో 20 మందికి పైగా గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్‌లు హడావిడిగా ఆమోదించడం, వేయడం ఈ మరణాలకు కారణం కావచ్చని ఆరోపించారు. కాగా దీనిపై కేంద్ర ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌ట‌న చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ ఆక‌స్మిక‌ మ‌ర‌ణాల‌కు కార‌ణం కాద‌ని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి రెండు సార్లు రీసెర్చ్ చేసిన‌ట్టు పేర్కొంది. రెండు సార్లు జరిపిన ప‌రిశోధ‌న‌ల్లో ఆక‌స్మిక మ‌ర‌ణాల‌కు వ్యాక్సిన్ కు సంబంధం లేదని శాస్త్ర‌వేత్త‌లు నిర్దారించిన‌ట్టు స్ప‌ష్టం చేసింది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మరియు AIIMS సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో కరోనా వ్యాక్సిన్‌లకు, కోవిడ్ 19 తరవాత ఆకస్మిక మరణాలకు మధ్య సంబంధం లేదని నిర్దారించాయని తెలిపింది. దేశంలో 40ఏళ్లలోపు గుండెపోటు మరణాలు పెరుతున్నాయనే కారణంతో ఐసీఎంఆర్ ఎయిమ్స్ పరిశోధనలు చేస్తోంద‌ని పేర్కొంది. జీవనశైలి, జెనెటిక్స్, మొదటి నుండి ఉన్న అనారోగ్య సమస్యలే ఆక‌స్మిక మ‌ర‌ణాల‌కు కార‌ణం అని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయ‌ని స్ప‌ష్టం చేసింది. కాబ‌ట్టి ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా కోవిడ్ 19 వ్యాక్సిన్ల వ‌ల్ల‌నే ఆక‌స్మిక మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయ‌ని ఆరోప‌ణ‌లు చేయ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించింది. వ్యాక్సిన్‌ల వల్ల చిన్న చిన్న దుష్ప్రభావాలు ఉండవచ్చు కానీ పెద్ద అనారోగ్య సమస్యలు తలెత్తవని తెలిపింది.

Next Story