- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme Court : రాజకీయాల్లో ఉన్న లాయర్లూ ‘బార్’ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు : సుప్రీంకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో : రాజకీయ పార్టీల(political party)తో సంబంధాలున్న న్యాయవాదులు బార్ కౌన్సిళ్ల(Bar bodies) ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించాలని కేంద్రం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలకు ఆదేశాలివ్వాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) విచారిస్తూ సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో : రాజకీయ పార్టీల(political party)తో సంబంధాలున్న న్యాయవాదులు బార్ కౌన్సిళ్ల(Bar bodies) ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించాలని కేంద్రం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలకు ఆదేశాలివ్వాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) విచారిస్తూ సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీల సభ్యత్వం కలిగిన వారికి బార్ కౌన్సిళ్ల ఎన్నికల్లో పోటీచేసే అవకాశమిస్తే నష్టమేం జరగదని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘‘ప్రజాస్వామిక దేశంలో న్యాయవాదులు విభిన్న రాజకీయ సైద్ధాంతికతలపై విశ్వాసాన్ని కలిగి ఉండటంలో తప్పేమీ లేదు. అయితే ఆ విశ్వాసాలు రాజ్యాంగానికి లోబడి ఉంటే సరిపోతుంది’’ అని కోర్టు పేర్కొంది. అడ్వకేట్ సి.ఆర్.జయా సుకిన్ దాఖలు చేసిన ఈ పిల్‌పై సీనియర్ అడ్వకేట్ సిరాజుద్దీన్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.
రాజకీయ పార్టీలతో సంబంధమున్న న్యాయవాదులు బార్ కౌన్సిళ్ల ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని సిరాజుద్దీన్ కోరారు. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఇందుకు నిరాకరించింది. గతంలో రాం జెఠ్మలానీ వంటి దిగ్గజ న్యాయవాదులు ఓ వైపు రాజకీయాల్లో, మరో వైపు బార్ కౌన్సిళ్లలో కీలక పాత్ర పోషించిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ‘‘కపిల్ సిబల్‌ను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని మీరు కోరుకుంటున్నారా ? బీజేపీ రాజ్యసభ ఎంపీ మనన్ కుమార్ మిశ్రాను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని కోరుకుంటున్నారా ?’’ అని ఈసందర్భంగా పిటిషనర్‌ను సుప్రీంకోర్టు బెంచ్ ప్రశ్నించింది. దీంతో కనీసం ఈ అంశాన్ని లా కమిషన్‌కు సిఫారసు చేయాలని సుప్రీంకోర్టును సీనియర్ అడ్వకేట్ సిరాజుద్దీన్ కోరారు. అయితే అందుకు కూడా ధర్మాసనం నో చెప్పింది. ఈ పిల్‌ను ఉపసంహరణ చేసుకునేందుకు పిటిషనర్‌కు కోర్టు అనుమతి మంజూరు చేసింది.






