- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jaishankar: పాక్ సైనిక దాడి కావాలనుకుంటే, కఠినంగానే స్పందిస్తాం: ఎస్ జైశంకర్
ఉద్రిక్తతను పెంచడం భారత్ ఉద్దేశ్యం కాదని, పాకిస్తాన్ సైనిక దాడికి దిగితే, అందుకు కఠినంగా బదులిస్తామని స్పష్టం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్గాం దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాక్ పెంచిన పోషించిన ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించింది. దీనికి పాకిస్తాన్ ప్రతీకారం తీచుకునేందుకు సిద్ధమైతే అందుకు తగినట్టుగానే 'చాలా చాలా స్పష్టమైన ప్రతిస్పందన' ఇస్తుందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం ప్రకటించారు. గురువారం అనూహ్య పర్యటనలో భాగంగా న్యూఢిల్లీకి వచ్చిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చితో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో జైశంకర్ ఈ ప్రకటన చేశారు. ఉద్రిక్తతను పెంచడం భారత్ ఉద్దేశ్యం కాదని, ఒకవేళ పాకిస్తాన్ సైనిక దాడికి దిగితే, అందుకు కఠినంగా బదులిస్తామని జైశంకర్ స్పష్టం చేశారు. మే 7న జమ్మూకశ్మీర్‌లోని పెహల్గాంలో సామాన్యులపై దాడి చేయడం ద్వారా పాక్ ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగిన నేపథ్యంలో న్యూఢిల్లీ చేరుకున్న సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి అదెల్ అల్-జుబీర్‌తో కూడా జైశంకర్ సమావేశమయ్యారు. ఉగ్రవాదాన్ని దృఢంగా ఎదుర్కోవడంపై భారత ఉద్దేశ్యాన్ని ఆయన సౌదీ అరేబియా మంత్రికి వివరించారు. 'తమ ప్రాంతంలోని సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. అందుకే తాము మరింత తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది. ఒకవేళ పాకిస్తాన్ సైనిక దాడులకు దిగాలని భావిస్తే, అందుకు తగినట్టుగానే కఠిన వైఖరిని అనుసరిసాం. అందులో ఎలాంటి సందేహం లేదని జైశంకర్ ఘాటుగా చెప్పారు.
- Tags
- S Jaishankar
- Iran
- Saudi Arabia
- Operation Sindoor
- India-Pakistan conflict
- India-Pakistan conflict War
- Pahalgam terror attack
- Precision strikes
- Indian Armed Forces
- Pakistan-occupied Kashmir (PoK)
- Cross-border terrorism
- Airstrikes
- Jaish-e-Mohammed
- Defence Ministry
- Airspace closure
- Retaliation
- Jammu and Kashmir
- Anti-terror operation
- Military escalation
- Telugu News
- National News






