ఎమర్జెన్సీని ఏ భారతీయుడు మరచిపోడు.. ప్రధాని మోడీ సెన్సేషనల్ ట్వీట్

by Kema Shiva Kumar |

ఎమర్జెన్సీ (Emergency)ని ఏ భారతీయుడు మరిచిపోడని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అన్నారు.

ఎమర్జెన్సీని ఏ భారతీయుడు మరచిపోడు.. ప్రధాని మోడీ సెన్సేషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమర్జెన్సీ (Emergency)ని ఏ భారతీయుడు మరిచిపోడని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అన్నారు. ఇవాళ ఆయన ఇందిరా గాంధీ ఎమ‌ర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్వీట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. భారత చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయమని అన్నారు. అందుకే ఈ రోజును తమతో పాటు దేశ ప్రజలు ‘సంవిధాన్‌ హత్యా దివస్‌’ (Samvidhaan Hatya Divas)గా జరుపుకుంటున్నారని తెలిపారు. ఎమర్జెన్సీతో నాటి నేతలు భారత రాజ్యాంగంలో పొందుపరచిన విలువలు పక్కన పెట్టబట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక హక్కులను కాలరాశారని, పత్రికా స్వేచ్ఛను అణచివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, సామాన్య పౌరులను అన్యాయంగా జైలులో వేశారని ఆరోపించారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ప్రజాస్వామ్యాన్ని అరెస్టు చేసినట్లుగా అనిపించిందని కామెంట్ చేశారు. ఎమర్జెన్సీని పరిస్థితులను ఏ భారతీయుడు అంత సులువుగా మరచిపోరని.. అందుకు వ్యతిరేకంగా పోరాడిన వారికి తన సెల్యూట్ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించేందుకు..అన్ని రంగాల వారు పోరాటం చేశారని గుర్తు చేశారు. వారి పోరాటం వల్లే ఎమర్జెన్సీని ఎత్తేశారని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని సూత్రాలను బలోపేతం చేస్తామని.. వికసిత్‌ భారత్‌ సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు. పేదలు, అణగారిన వర్గాల కలలను నెరవేరుస్తామని అన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్ల పూర్తియిన నేపథ్యంలో ‘ది ఎమర్జెన్సీ డైరీస్‌’ పేరిట ఓ పుస్తకాన్ని తీసుకురాబోతున్నట్లుగా ఆయన వెల్లడించారు. అందులో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా తన ప్రయాణం.. ఎమర్జెన్సీ రోజుల్లో పరిస్థితులో అందులో వివరంగా ఉంటాయని ప్రధాని మోడీ వెల్లడించారు.

Next Story