వాహనదారులకు మరో షాకింగ్ రూల్.. 'నో హెల్మెట్.. నో పెట్రోల్'

by Muthe.Rajitha |

వాహనదారులకు మరో షాకింగ్ న్యూస్ ఇచ్చారు అధికారులు.

వాహనదారులకు మరో షాకింగ్ రూల్.. నో హెల్మెట్.. నో పెట్రోల్
X

దిశ, వెబ్ డెస్క్ : వాహనదారులకు మరో షాకింగ్ న్యూస్ ఇచ్చారు అధికారులు. ఇకపై హెల్మెట్ ధరించకపోతే, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే వారికీ పెట్రోల్ బంకుల్లో ఫ్యూయల్ ఇవ్వకూడదనే 'నో హెల్మెట్.. నో పెట్రోల్'(No Helmet.. No Petrol) అనే న్యూ రూల్ తెచ్చారు. మధ్యప్రదేశ్(MP) లోని ఇండోర్(Indore) పట్టణ అధికారులు ఈ కొత్త నిబంధన తీసుకు వచ్చారు. కాగా ఇండోర్ లో ట్రాఫిక్ అతిక్రమణలపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో... రాష్ట్ర రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మనోహర్ సప్రె ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిబంధన ప్రకారం ఆగస్టు 1 నుంచి వాహనదారులకు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి చేసింది. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వారికి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ ఇవ్వకూడని ఆదేశాలు జారీ అయ్యాయి. ఒకవేళ బంకులు ఈ నిబంధనలు అతిక్రమిస్తే వారికి ఏడాది జైలు శిక్ష కూడా విధించే కఠిన చర్యలు తీసుకు వచ్చింది. ఈ విషయంలో వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటు బెల్టు తప్పనిసరిగా ధరించే విధంగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు అధికారులు.

Next Story