- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi Election Results: ఢిల్లీ ఎన్నికల వేళ.. ఎల్జీ కీలక ఉత్తర్వులు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Election Results) ఆమ్‌ఆద్మీపార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇలాంటి వేళ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Election Results) ఆమ్‌ఆద్మీపార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇలాంటి వేళ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేయాలని వీకే సక్సేనా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఫైళ్లు, రికార్డులను తొలగించొద్దని అన్ని విభాగాలకు ఆదేశాలు అందాయి. ఆయన సూచనల మేరకు.. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్(GAD) ఉత్తర్వులు ఇచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికార మార్పును చూపిస్తున్నాయని అందులో పేర్కొంది. కాగా.. ‘‘భద్రతాపరమైన సమస్యలు, రికార్డుల భద్రతను పరిరక్షించుకునేందుకు ఈ అభ్యర్థన చేశాం’’ అని జీఏడీ పేర్కొంది. సచివాలయంలోని అన్ని శాఖల ఇంఛార్జిలు, సెక్రటేరియట్ కార్యాలయాలు, మంత్రుల క్యాంపు కార్యాలయాలకు ఈ ఉత్వర్వులు వర్తిస్తాయని, అన్ని రికార్డులను భద్రపరచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. ఇకపోతే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత ఈ ఉత్తర్వులు రావడం చర్చనీయాంగా మారింది. అయితే, ఈ ఉత్తర్వులు పాలనలో భగామని, అధికార మార్పిడి జరుగుతున్న సమయంలో ముఖ్యమైన రికార్డులు కాపాడటమే ఈ ఉత్తర్వుల ఉద్దేశమని అధికారులు అంటుకున్నారు.
ఢిల్లీలో బీజేపీ గెలుపు
కాగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ అంచనాలకు అనుగుణంగా బీజేపీ ఘన విజయం సాధించింది. అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అంతేకాదు.. ఆప్ అధినేత కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ సహా పలువురు పార్టీ ముఖ్యనేతలకు ఓటమి తప్పలేదు.






