- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Man Kills Self: డ్రామా ఏమీ లేదు.. బాధలో ఉన్నా.. ఆత్మహత్య చేసుకుంటున్నా
మహిళతో వివాహేతర సంబంధం.. ఆ తర్వాత ఆమె వేధింపులు.. ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొన్నాయి.. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాకు చెందిన అల్తాఫ్ మహారాష్ట్రలోని థానేలో ఆత్మహత్య చేసుకున్నాడు.

దిశ, నేషనల్ బ్యూరో: మహిళతో వివాహేతర సంబంధం.. ఆ తర్వాత ఆమె వేధింపులు.. ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొన్నాయి.. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాకు చెందిన అల్తాఫ్ మహారాష్ట్రలోని థానేలో ఆత్మహత్య చేసుకున్నాడు. రిస్ట్ కట్ చేసుకుని, విషం తాగి, ఉరివేసుకుని సూసైడ్ కి పాల్పడిన సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో.. "నేను డ్రామా చేయడం లేదు. డ్రామా ఏమీ లేదు.. బాధలో ఉన్నా.. ఆత్మహత్య చేసుకుంటున్నా. ఇలానే చనిపోతున్నా. ఇప్పటికే చాలాకాలం జీవించాను. ఇక జీవించను " అని అతను చెబుతున్నట్లుగా ఉంది. రిస్ట్ కట్ చేసుకోవడం వల్ల చేయి అంతా రక్తంతో నిండిపోయినట్లు వీడియో ఉంది. మరోదాంట్లో విషం తినడంతో నోట్లోనుంచి నురగ వస్తున్నట్లుగా ఉంది. మరోవైపు, అల్తాఫ్ మరణించిన నాలుగు రోజుల తర్వాత మహారాష్ట్ర పోలీసులు అతడి కుటుంబానికి సమాచారం అందించారు. అయితే, ఎఫైర్ పెట్టుకున్న మహిళ ప్రెగ్నెన్సీ పేరుతో అల్తాఫ్ ని బ్లాక్ మెయిల్ చేసిందని అతడి కుటుంబం ఆరోపించింది. దీనిపై మహారాష్ట్ర పోలీసులను సంప్రదించామని.. వారు ఉన్నావో పోలీసులను సంప్రదించిమన్నారని కుటుంబసభ్యులు తెలిపారు. ఉన్నావో పోలీసులు థానేలో కేసు నమోదు చేయమంటున్నారని పేర్కొన్నారు. థానే, ఉన్నావో పోలీసులు అధికార పరిధి సమస్యలను ఉదాహరిస్తూ కేసుని దాటవేస్తున్నారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
మహిళ వేధింపులే కారణం
అల్తాఫ్ కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. థానేలో అతడు దర్జీగా పనిచేస్తున్నాడు. కాగా.. గతేడాది అతడి తల్లి మరణం తర్వాత ఇంటికి వచ్చాడు. ఉన్నావ్ లోనే పనిచేయాలని కుటంబసభ్యులు కోరగా.. అతడు థానే తిరిగివెళ్లలేదు. ఆ తర్వాత, పొరుగున ఉన్న వివాహితతో అతడు సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అల్తాఫ్ కుటుంబం.. అతడ్ని మందలించి తిరిగి థానేకు పంపారు. కాగా.. అప్పట్నుంచి అల్తాఫ్ ని మహిళ వేధిస్తూనే ఉన్నట్లు అతడిసోదరి రేష్మ చెప్పుకొచ్చారు. రేష్మ మీడియాతో మాట్లాడుతూ.. "అల్తాఫ్ వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ మహిళ అతన్ని హింసిస్తూనే ఉంది. తాను ప్రెగ్నెంట్ అని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తూ.. తరచూ డబ్బులు అడిగేది. ఆమె డిమాండ్లు రూ. 10,000 నుంచి రూ. లక్ష వరకు ఉన్నాయి. తప్పుడు కేసు బనాయించి జైలు శిక్ష విధిస్తానని మా సోదరుడ్ని బెదిరించింది. దీంతో అతను ఆత్మహత్య చేసుకుని చనిపోవాల్సి వచ్చింది" అని ఆమె చెప్పారు. ఆత్మహత్యకు ముందు అల్తాఫ్ మహిళకు వీడియోకాల్ చేసినట్లు వెల్లడించింది. తను తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు మహిళకు అల్తాఫ్ ఫోన్ చేసినట్లు పేర్కొంది. "నాకు నా భర్త ఉన్నాడు. నువ్వు చనిపోతే ఏం కోల్పోను” అని అల్తాఫ్ తో మహిళ దురుసుగా ప్రవర్తించినట్లు రేష్మ పేర్కొంది.






