- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చండీగఢ్ చట్ట ప్రక్రియ సరళీకరణ ప్రతిపాదనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: కేంద్ర హోంశాఖ
చండీగఢ్ చట్ట ప్రక్రియ సరళీకరణ ప్రతిపాదనపై సోషల్ మీడియాలో అనేక వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ స్పందించింది.

దిశ, వెబ్ డెస్క్: చండీగఢ్ చట్ట ప్రక్రియ సరళీకరణ ప్రతిపాదనపై సోషల్ మీడియాలో అనేక వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ (Central Home Ministry) స్పందించింది. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ చట్టం రూపొందించే ప్రక్రియను సరళీకరించాలన్న ప్రతిపాదనపై ఇంకా ఏదైనా తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదన వల్ల చండీగఢ్ పరిపాలనా నిర్మాణం (Administrative structure of Chandigarh), పాలన విధానం లేదా పంజాబ్–హర్యానా రాష్ట్రాలతో ఉన్న సాంప్రదాయిక సంబంధాల్లో ఏ మార్పూ ఉండబోదని హోం శాఖ ప్రకటించింది. సంబంధిత పక్షాలందరితో సంపూర్ణంగా చర్చించిన తర్వాత మాత్రమే తగిన నిర్ణయం తీసుకుంటామని, ఈ విషయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్రం హామీ ఇచ్చింది. రాబోయే పార్లమెంట్ వింటర్ సెషన్‌లో ఈ మేరకు ఎటువంటి బిల్లు ప్రవేశ పెట్టే ఉద్దేశం లేదని కూడా స్పష్టం చేసింది.






