Israel: గాజాను స్వాధీనం చేసుకోవడం మినహా మరోమార్గం లేదు: బెంజమిన్ నెతన్యాహు

by S Gopi |

మా లక్ష్యం గాజాను ఆక్రమించడం కాదు, గాజాను విముక్తి చేయడమేనని స్పష్టం చేశారు.

Israel: గాజాను స్వాధీనం చేసుకోవడం మినహా మరోమార్గం లేదు: బెంజమిన్ నెతన్యాహు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయడం, హమాస్ అంతం చేసి, గాజాను స్వాధీనం చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన నెతన్యాహు.. ప్రణాళిక ప్రకారం సైనిక దాడిని నిర్వహిస్తున్నట్టు సమర్థించుకున్నారు. మా లక్ష్యం గాజాను ఆక్రమించడం కాదు, గాజాను విముక్తి చేయడమేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇజ్రాయెల్ చర్యలను ఇంటాబయటా జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్దమని, గాజాను సైనికుల నీడ నుంచి స్వేచ్ఛనివ్వడం, ఆ ప్రాంతంలో భద్రతను ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణలోకి తీసుకోవడమే తమ ఉద్దేశమని అన్నారు. తదుపరి చర్యలకు తక్కువ సమయం ఉంది. హమాస్ చర్యల కారణాంగానే గాజా ప్రజలు మరణిస్తున్నారని, ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేయడం, మానవతా సాయం అందకుండా చేయడంపై నెతన్యాహు ఆరోపణలు చేశారు. గాజాలోని అనేక సమస్యలకు హమాస్ మిలిటెంట్ గ్రూప్ మాత్రమే కారణమని అన్నారు. మరోవైపు, గాజాలో సహాయం కోరుతూ కనీసం 26 మంది పాలస్తీనియన్లు మరణించారని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైనిక కార్యకలాపాలను విస్తరించాలనే ప్రణాళికలను నిరసిస్తూ ఇజ్రాయెల్ బందీల కుటుంబాలు సమ్మెకు పిలుపునిచ్చాయి.

Next Story