- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme Court: బెంగాల్ అదనపు టీచర్ల నియామకంపై సీబీఐ విచారణ అవసరం లేదు
పశ్చిమ బెంగాల్ లో అదనపు టీచర్ల నియామకంపై సీబీఐ విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల 25 వేల మంది టీచర్ల నియామకాలను కోర్టు రద్దు చేసింది. ద

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ లో అదనపు టీచర్ల నియామకంపై సీబీఐ విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల 25 వేల మంది టీచర్ల నియామకాలను కోర్టు రద్దు చేసింది. దీంతో, వారి కోసం దీదీ సర్కారు అదనపు టీచర్ల నియామకం చేపట్టింది. అయితే, ఆ పోస్టుల సృష్టిపై సీబీఐ విచారణ ఉండదని కోర్టు పేర్కొంది. క్యాబినెట్ నిర్ణయాలను దర్యాప్తు చేయకుండా కోర్టులను నిషేధించారని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అదనంగా సృష్టించిన పోస్టులపై సీబీఐ విచారణ అవసరమని కలకత్తా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కలకత్తా హైకోర్టు తీర్పుని కొట్టివేసింది.
బెంగాల్ టీచర్ రిక్రూట్ మెంట్ స్కాం
ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్ సి, గ్రూప్ డి స్టాఫ్ సిబ్బంది నియామకాల కోసం 2016లో బెంగాల్ సర్కారు రాష్ట్ర స్థాయి సెలక్షన్ పరీక్ష నిర్వహించింది. 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. తర్వాత ఇందులో ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. ఈ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసులో దాఖలైన పిటిషన్లపై దర్యాప్తు చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఇటీవలే కీలక తీర్పు వెలువరించింది. అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 25వేల టీచర్ల నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆ నియామకాలను రద్దు చేస్తూ గతంలో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సమర్థించింది. అంతేగాక, దీనికింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది.






