హామీలు నెరవేర్చకుంటే మరోసారి ఆందోళన.. కిసాన్ మహాపంచాయత్‌లో రైతు సంఘాల హెచ్చరిక

by Dishafeatures2 |
హామీలు నెరవేర్చకుంటే మరోసారి ఆందోళన.. కిసాన్ మహాపంచాయత్‌లో రైతు సంఘాల హెచ్చరిక
X

న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ మంత్రి రైతు సంఘాల ప్రతినిధుల బృందం చర్చలు నిరాశజనకంగా సాగాయి. సోమవారం చర్చల్లో కనీస మద్ధతు ధర(ఎమ్ఎస్‌పీ)పై ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిపాయి. రైతుల డిమాండ్ లేఖను కృషి భవన్లో మంత్రికి అందజేసినట్లు రైతు నేత దర్శన్ పాల్ తెలిపారు. సమావేశం తర్వాత కేంద్ర మంత్రిని రైతులను మేము ప్రభుత్వాన్ని నడిపిస్తే మీరు ఆందోళనలు నిర్వహించాలని అన్నట్లు రైతుల బృందం ఆరోపించింది. రైతులతో సమావేశంలో కేంద్రం వైఖరి స్పష్టంగా అర్థమైనట్లు రైతు నేత రాకేష్ తికాయత్ అన్నారు. ఆందోళనలు చేపట్టకుండా ఎంఎస్పీ కేంద్రం ముందుకు వెళ్లదని చెప్పారు.

రైతులు ఎంఎస్పీ గ్యారంటీ చట్టం అమలు, ఎంఎస్పీ కమిటీ ఏర్పాటు, మరణించిన రైతులకు పరిహారం, కేసుల ఉపసంహారణ, విద్యుత్ సవరణ బిల్లు, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తొలగింపు వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రభుత్వం తమకు ఇచ్చిన హమీలను నేరవేర్చని పక్షంలో విస్తృతంగా ఆందోళన చేపడుతామని హెచ్చరికలు జారీ చేసింది. రైతుల ఆందోళన కారణంగా ఢిల్లీ పోలీసులు రాంలీలా మైదాన్ వద్ద 2,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. దీంతో పాటు పలు మార్గాల్లో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు రూట్ డైవర్షన్ కూడా చేశారు. వాహనదారులు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. కిసాన్ పంచాయత్‌కు పెద్ద ఎత్తున రైతులు హజరయ్యారు.



Next Story