10వ సారి బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్

by Malleboina Mahesh |

ఇటీవల బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఏకంగా 202 స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

10వ సారి బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి (NDA alliance) ఏకంగా 202 స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చినప్పటికి ముందుగా ప్రకటించిన విధంగా సీఎంగా నితీష్ కుమార్ ను ఎన్డీయే కూటమి ఏకగ్రీవంగా ఎంచుకుంది. అనంతరం ఈ రోజు బీహార్‌లో చరిత్ర సృష్టిస్తూ నితీష్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. NDA భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఆయన మరోసారి ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించారు. 243 సభ్యుల అసెంబ్లీలో 202 సీట్లను దక్కించుకున్న NDA విజయోత్సాహాన్ని ప్రతిబింబించేలా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీయే పక్ష ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, జేడీయూ–బీజేపీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో సీఎంతో పాటు సమ్రాట్ చౌధరీ, విజయ్ కుమార్ సిన్హాలు మళ్లీ డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు చేపట్టారు. నితీష్ నాయకత్వంలోని ఈ కొత్త ప్రభుత్వం బీహార్‌లో అభివృద్ధి, పరిపాలన పారదర్శకతను మరింత బలోపేతం చేయబోతుందనే విశ్వాసం వ్యక్తమవుతోంది. ఈ ప్రమాణ స్వీకారంతో బీహార్ రాజకీయాల్లో నితీష్ మరోసారి తన ప్రభావాన్ని స్పష్టంగా చాటుకున్నారు.

Next Story