- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress: రాజకీయాల్లో నితీష్‌ది కుర్చీలాటా, బీజేపీతో పొత్తు అవకాశవాదం: మల్లికార్జున్ ఖర్గే
నితీష్ కుమార్ కేవలం ముఖ్యమంత్రి పదవిలో ఉండేందుకు, ఆ కుర్చీ కోసమే పార్టీలు మారుతుంటారు.

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆయన రాజకీయాల్లో కుర్చీలాట ఆడుతున్నారని ఆరోపణలు చేశారు. ఆదివారం బక్సర్‌లోని దల్‌సాగర్ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ 'జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ' ర్యాలీలో మాట్లాడిన ఖర్గె.. బీహార్‌లో జేడీయూ-బీజేపీ కూటమిని అవకాశవాద పొత్తు అని అభివర్ణించారు. ఇది రాష్ట్ర ప్రజలకు మంచిది కాదు. నితీష్ కుమార్ కేవలం ముఖ్యమంత్రి పదవిలో ఉండేందుకు, ఆ కుర్చీ కోసమే పార్టీలు మారుతుంటారు. మహాత్మగాంధీని సిద్ధాంతాన్ని చంపిన వారితో నితీష్ చేతులు కలిపారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ పరిణామాలను గమనించి ఏడాది చివర్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, 'మహాగఠ్‌బధన్ కూటమి'కి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా, ప్రధాని మోడీ అబద్ధాల ఫ్యాక్టరీని నడుపుతున్నారని ఎద్దెవా చేశారు. బీహార్‌కు ఇస్తామని చెప్పిన రూ. 1.25 లక్షల కోట్ల ప్యాకేజీ హామీ ప్రస్తావన ఎందుకు లేదని, దీని గురించి ప్రజలు నితీష్‌ని నిలదీయాలని ఖర్గె అన్నారు. ఇటీవలి పార్లమెంటు సమావేశాలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం అభివృద్ధి కంటే విభజన అంశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని ఆరోపించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఎక్కువగా అంశం వక్ఫ్ బిల్లు గురించి చర్చ జరిగింది. హిందువులు, ముస్లింల గురించి మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించడం ద్వారా ఓట్లు పొందవచ్చని మోడీ, బీజేపీ నేతలు భావిస్తున్నారని తెలిపారు. పేదలు, మహిళలు, బలహీనవర్గాలకు బీజేపీ, ఆర్ఎస్సెస్ వ్యతిరేకమన్న ఖర్గే, కులమతాలుగా సమాజాన్ని విభించి పాలిస్తున్నారని, దీనికి వక్ఫ్ చట్టమే సరైన ఉదాహరణ అని పేర్కొన్నారు.






