- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్.. పదోసారి బిహార్ సీఎంగా నితీశ్.. ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్
బిహార్ ముఖ్యమంత్రిగా మెజార్టీ ఎమ్మెల్యేలు నితీశ్ కుమార్‌నే ఎన్నుకున్నట్లుగా బిహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ కొనసాగుతారని బిహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ప్రకటించారు. 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నితీశ్ కుమార్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 20వ తేదీన పాట్నా గాంధీ మైదాన్ లో నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రకటించారు. అనంతరం నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి, గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కు రాజీనామా పత్రాన్ని, కేబినెట్ రద్దు తీర్మానాన్ని అందించారు. నితీశ్ కుమార్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యేంతవరకూ నితీశ్ కుమార్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని గవర్నర్ తెలిపారు.
రేపు ఉదయం 10 గంటలకు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. అనంతరం ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా కూటమి తరపున సీఎంగా నితీశ్ ను ఎన్నుకోనున్నారు.
కాగా.. ఇటీవల బిహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 202 స్థానాల్లో గెలిచింది. ఈ ఎన్నికల్లో మహాగఠ్ బంధన్ కూటమి ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. బీజేపీకి గెలుపు అసాధ్యమనుకున్న అలీనగర్లో పాతికేళ్ల మైథిలి ఠాకూర్ గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా.. నితీశ్ తో పాటు మంత్రులుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.






