అందుకోసమే నితీశ్ కుమార్ సీఎం పోస్టు వదులుకున్నారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-04-20 12:56:44  IST  )

బిహార్‍లో బీజేపీ వ్యక్తి సీఎంగా కావడం పై రాహుల్ గాంధీ కీలక కీలక వ్యాఖ్యలు చేశారు.

అందుకోసమే నితీశ్ కుమార్ సీఎం పోస్టు వదులుకున్నారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు దశాబ్దాల పాటు బిహార్ రాజకీయాలను శాసించిన నితీశ్ కుమార్ ఇటీవల అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడం యావత్ దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను సీఎం పోస్టు వదులుకోవడమే కాకుండా ఆ కుర్చిలోకి తన పార్టీకి చెందిన నేతలను కాదని బీజేపీ నేతకు అవకాశం ఇవ్వడం వెనుక నితీశ్ కుమార్ వ్యూహం ఏంటనేది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ తీరుపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నితీశ్ కుమార్ గతంలో చేసిన పనుల కారణంగా ఆయన బీజేపీకి పూర్తిగా లొంగిపోయారని ఆరోపించారు. ఇవాళ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా తూత్తుకుడిలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. గతంలో నితీశ్ కుమార్ చేసిన పనుల వల్లే బీజేపీ ఆయనను సులభంగా నియంత్రించగలుగుతోందని ధ్వజమెత్తారు. నితీశ్ కుమార్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. బిహార్‌లో ఏం జరిగిందో చూడండి. అక్కడి ముఖ్యమంత్రిని తొలగించి, బీజేపీ వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టారు. ఇది ఎందుకు జరిగింది? ఎందుకంటే బిహార్ ముఖ్యమంత్రి రాజీపడ్డారు (compromised). అందుకే ఆయన ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా రాజ్యసభకు వెళ్లిపోయారు అని రాహుల్ ఎద్దేవా చేశారు.

తమిళనాడులో సాగనివ్వం:

నితీశ్ కుమార్ ను ఎలా నియంత్రించారో అదే రకంగా తమిళనాడులో కూడా బీజేపీ చేయాలని చూస్తోందని రాహుల్ ఆరోపించారు. తమకు పూర్తిగా లొంగి ఉండే ప్రభుత్వం, తాము చెప్పినట్టు వినే ముఖ్యమంత్రి వారికి కావాలని కానీ మేము దాన్ని ఎప్పటికీ జరగనివ్వమన్నారు.

తమిళ సంస్కృతిని కాపాడుకుందాం.. కన్యాకుమారిలో రాహుల్ గాంధీ

Next Story