- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్.. ఈ నెల 20న బాధ్యతలు చేపట్టే అవకాశం!
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్‌కు చెందిన నితిన్ నబీన్ ఈ నెల 20న బాధ్యతలు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్‌కు చెందిన నితిన్ నబీన్ ఈ నెల 20న బాధ్యతలు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను జనవరి 19న నిర్వహించనున్నారు. నబీన్ ఒక్కరే అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. డిసెంబరులో పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నితిన్ నబీన్, ప్రస్తుతం జేపీ నడ్డా స్థానంలో జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. ఈ ఎన్నికలో ఒక్కరే నామినేషన్ దాఖలు చేస్తే అదే రోజున ఫలితం ప్రకటించనున్నట్లు సమాచారం. బీజేపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కె. లక్ష్మణ్ అధికారికంగా అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు.
అతి పిన్న వయసులో పార్టీ సారథ్య బాధ్యతలు
46 ఏళ్ల వయసులో జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న నితిన్ నబీన్, అతి పిన్న వయసులో పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. 1980 మే 23న జన్మించిన నబీన్, బీహార్ మంత్రి, ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, జాతీయ పదాధికారులు, సీనియర్ నేతలు హాజరుకానున్నారు. ప్రస్తుతం నితిన్ నబీన్ తమిళనాడు, అసోం, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై దృష్టి సారిస్తున్నారు.






