Nitin Gadkari: మూడో ప్రపంచ యుద్ధం తప్పదేమో: నితిన్ గడ్కరీ

by S Gopi |

నియంతృత్వం కారణంగా సమన్వయం, సామరస్యం, ప్రేమ కనుమరుగవుతున్నాయని గడ్కరీ అన్నారు

Nitin Gadkari: మూడో ప్రపంచ యుద్ధం తప్పదేమో: నితిన్ గడ్కరీ
X

దిశ, నేషనల్ బ్యూరో: అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతాలిస్తున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన..

' ఇజ్రాయెల్, ఇరాన్ తో పాటు రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మధ్య ప్రపంచవ్యాప్తంగా ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ పరిణామాలు ఎప్పుడైనా మరొక ప్రపంచ యుద్ధంలోకి నెట్టే పరిస్థితి కనిపిస్తోంది" అని బీజేపీ సీనియర్ నేత గడ్కరీ అన్నారు. అధికారంలో ఉన్నవారి నిరంకుశత్వం, నియంతృత్వం కారణంగా సమన్వయం, సామరస్యం, ప్రేమ కనుమరుగవుతున్నాయని గడ్కరీ అన్నారు. ప్రపంచానికి సత్యం, అహింస, శాంతి సందేశాన్ని అందించే గౌతమ బుద్ధుని భూమిగా భారత్ ను ప్రశంసిస్తూ.. ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని సమీక్షించి, చర్చించిన తర్వాత భవిష్యత్ విధానాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరాన్ని గడ్కరీ అభిప్రాయపడ్డారు.

యుద్ధానికి సంబంధించిన సాంకేతిక పురోగతి చూస్తుంటే మానవాళిని రక్షించడం కూడా కష్టమనిపిస్తోంది. అధునాతన సాంకేతికత కారణంగా యుద్ధ కోణాలు మారాయి. క్షిపణులు, డ్రోన్‌ల వాడకం పెరుగుతోంది, ఇవి ట్యాంకులు, ఇతర రకాల విమానాల అవసరాలను తగ్గిస్తున్నాయి అని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మానవాళిని రక్షించడం కష్టంగా మారింది. తరచుగా, పౌరులు నివసించే స్థావరాలపై క్షిపణులను ప్రయోగించారు. ఇది తీవ్రమైన సమస్యను సృష్టించింది , ఈ సమస్యలన్నింటినీ ప్రపంచ స్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉందని గడ్కరీ పేర్కొన్నారు.

Next Story