- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్... నిత్యానంద స్వామి మృతి ?
వివాదాస్పద స్వామి నిత్యానంద గురించి తెలియని వారు ఉండరు. అప్పట్లో సినీ నటి రంజితతో రాసలీలలు సాగించి... రచ్చ రచ్చ

దిశ, వెబ్ డెస్క్: వివాదాస్పద స్వామి నిత్యానంద ( Swami Nithyananda ) గురించి తెలియని వారు ఉండరు. అప్పట్లో సినీ నటి రంజితతో ( Ranjitha ) రాసలీలలు సాగించి... రచ్చ రచ్చ చేశాడు నిత్యానంద స్వామి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక అంశం ద్వారా వివాదంగా మారుతూనే ఉన్నాడు. అయితే అలాంటి వివాదాస్పద నిత్యానంద స్వామి మరణించినట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆయన మరణించినట్లు.. పోస్టులు కూడా పెడుతున్నారు. గడిచిన రెండు రోజుల కిందటే చనిపోయాడని కూడా అంటున్నారు. హిందూ ధర్మాన్ని కాపాడడానికి.. నిత్యానంద తన ప్రాణాలు త్యాగం చేశారని... తమిళ మీడియా వర్గాల్లో వార్తలు కూడా వస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ చెప్పినట్లు ఓ వీడియోను కూడా వైరల్ చేస్తున్నారు.
అయితే దీనిపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారని సమాచారం అందుతోంది. అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ... ఆయన చనిపోయినట్లు మాత్రం నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. వీటిని చూసిన నెటిజెన్స్ రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా తప్పుడు ప్రచారం అని... ఏప్రిల్ ఫస్ట్ కనుక అందర్నీ ఫూల్స్ చేయడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు నెటిజెన్స్. ఇది ఇలా ఉండగా... నిత్యానంద స్వామి కి అహ్మదాబాద్ తో పాటు దేశంలోని దాదాపు 40 ప్రాంతాల్లో ఆశ్రమాలు ఉన్నాయి. అప్పట్లో సె***క్స్ స్కాండల్ కేసులో ఇరుక్కుని ఇండియాని వదిలి పారిపోయాడు నిత్యానంద ( Swami Nithyananda ). ఆ తర్వాత హిందువుల కోసం కైలాస అనే ప్రత్యేక దేశాన్ని సృష్టించాడని.. కూడా ప్రచారంలో ఉంది.






