- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nithish: నితీశ్ కుమార్‌ను డిప్యూటీ పీఎం చేయాలి.. బీజేపీ నేత అశ్విని చౌబే సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాది చివరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆ రాష్ట్ర బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది చివరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆ రాష్ట్ర బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే (Ashwini choubey) సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ (Nithish kumar) ను దేశ ఉప ప్రధానిగా చేయాలని డిమాండ్ చేశారు. పాట్నాలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘నితీశ్ చాలా కాలం పాటు ఎన్డీఏలో సమన్వయకర్తగా పని చేశారు. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రధాని మోడీతో అత్యంత సన్నిహితంగా కలిసి పని చేస్తున్నారు. కాబట్టి ఆయనకు డిప్యూటీ పీఎం హోదా ఇవ్వాలి. నితీశ్ఉప ప్రధాని అయితే బిహార్ రాష్ట్రం నుంచి రెండో ఉప ప్రధానిగా నిలుస్తారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఈ ఏడాది చివర్లో బిహార్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ, జేడీయూలు కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చౌబే వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
అయితే చౌబే ప్రకటనపై జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) నేత నీరజ్ కుమార్ (Neeraj kumar) స్పందించారు. నితీష్ కుమార్, మోడీల రాజకీయ ద్వయం ప్రతిపక్షాలను స్తంభింపజేసిందన్నారు. బిహార్‌లో 2025 ఎన్నికలు నితీశ్ కుమార్ నాయకత్వంలో జరుగుతాయని తెలిపారు. ‘నితీశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని బీజేపీ కోరుకుంటోంది. కానీ ఈ వ్యాఖ్యల వల్ల సీఎం కుర్చీని తేజస్వీ యాదవ్ ఆక్రమించుకుంటారని చౌబే గ్రహించాలి. బిహార్‌లో అత్యున్నత అధికార పీఠం కావాలని ప్రతి బీజేపీ నాయకుడూ పగటి కలలు కంటున్నారు’ అని తెలిపారు. మరోవైపు ఓ కార్యక్రమంలో భాగంగా జన్ సూరజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. నితీశ్ కుమార్ మరోసారి సీఎం కాలేరని విమర్శించారు. ఆయన కేవలం ఐదు నెలలు మాత్రమే పదవిలో ఉంటారని తెలిపారు.






