Nithish: బిహార్ సీఎం అభ్యర్థి నితీశ్ కుమారే.. రాజ్ నాథ్ సింగ్ కీలక ప్రకటన

by B.Srinivas |

రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Nithish: బిహార్ సీఎం అభ్యర్థి నితీశ్ కుమారే.. రాజ్ నాథ్ సింగ్ కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నేత, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath singh) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) చీఫ్ నితీశ్ కుమారే (Nithish kumar) ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్థిగా ఉంటారని, ఆయన నాయకత్వంలోనే కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. పాట్నాలో బుధవారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రధాని మోడీ, సీఎం నితీశ్ కుమార్‌ల సంయుక్త నాయకత్వంలో బిహార్ అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్డీఏ హయాంలోనే బిహార్ సురక్షితంగా ఉందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని దీమా వ్యక్తం చేశారు.

అధికారంలో ఉండటమే ప్రతిపక్ష పార్టీల ఏకైక ఉద్దేశమని ఆరోపించారు. బిహార్‌ను వెనక్కి నెట్టి, యువత భవిష్యత్తును నాశనం చేసేందుకు కాంగ్రెస్, ఆర్జేడీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రానికి చెడ్డపేరు రావడానికి వారే కారణమని మండిపడ్డారు. బిహార్‌ను ముందుకు తీసుకెళ్ల సామర్థ్యం కేవలం ఎన్డీఏకు మాత్రమే ఉందన్నారు. కాగా, ఈ ఏడాది చివరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Next Story