- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయి: నిర్మలా సీతారామన్
బంగారం ధరల పెరుగుదలపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. సోమవారం ఆర్బీఐ సెంట్రల్ బోర్డు మీటింగ్‌లో ఆమె పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: బంగారం ధరల(Gold Rates) పెరుగుదలపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) స్పందించారు. సోమవారం ఆర్బీఐ సెంట్రల్ బోర్డు మీటింగ్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పలు దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని భారీగా కొంటున్నాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్ల వల్లే బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. బంగారం, వెండి దిగుమతుల గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వాటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని పేర్కొన్నారు. బ్యాంకులు తమ కోర్ బిజినెస్‌పై దృష్టి సారించాలని నిర్మలా సీతారామన్ సూచించారు. బీమా ఉత్పత్తులను మిస్ సెల్ చేయొద్దన్నారు. భారత్ వృద్ధి పథంలో పయనిస్తోందని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలన్నారు. పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులను పెంచాలని కోరారు. భారత్ సహా అన్ని దేశాలపై డొనాల్డ్ ట్రంప్ విధించిన 15 శాతం సుంకాలపై స్పందిస్తూ.. వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ అంశాన్ని సమీక్షిస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు. దీనిపై అప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటు నిర్ణయం అవుతుందన్నారు.






