- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Union Budget 2025: గురజాడ అప్పారావు పద్యంతో నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ స్టార్ట్
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో శనివారం ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న (Union Budget 2025) కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో శనివారం ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ 2025-26 పార్లమెంట్‌లో సమర్పించారు. ఇక బడ్జెట్ ప్రసంగంలో (Nirmala Sitharaman) కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గురజాడ సూక్తిని ప్రస్తావించి.. ప్రసంగం మొదలు పెట్టారు. ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అంటూ గురజాడ అప్పారావు రాసిన కవితతో లోక్‌సభలో తన బడ్డెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.
వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆమె చెప్పారు. తాము చేపట్టిన సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయని వెల్లడించారు. నేడు తన ఎనిమిదో బడ్జెట్లను ప్రవేశపెట్టి.. అత్యధిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా రికార్డు సాధించారు. అయితే బడ్జెట్ ప్రసంగాన్ని ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన పై చర్చ జరగాలని పట్టుబట్టాయి. విపక్షాలు ఆందోళన మధ్యే మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.






