నేడు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్ భేటీ

by Muthe.Rajitha |

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ప్రీ-బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు.

నేడు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్ భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు న్యూఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ప్రీ-బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. రాబోయే యూనియన్ బడ్జెట్ 2026–27 తయారీలో ఈ భేటీ కీలకమైనది. ఈ సమావేశంలో రాష్ట్రాలు తమ ఆర్థిక సమస్యలు, అవసరాలు, విజ్ఞప్తులను కేంద్రానికి తెలియజేస్తాయి. ముఖ్యంగా ఫిస్కల్ కర్బ్స్, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, జీఎస్టీ వాటా, వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై రాష్ట్రాలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తాయి.

రాష్ట్రాల నుంచి వచ్చే సూచనలను కేంద్రం పరిశీలించి బడ్జెట్‌లో పరిగణనలోకి తీసుకుంటుంది. కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమవుతాయి. జనవరి 29న ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. అలాగే యూనియన్ బడ్జెట్ 2026–27ను ఫిబ్రవరి 1 ఆదివారం రోజున నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమె వరుసగా తొమ్మిదో బడ్జెట్ కావడం విశేషం.

Next Story