- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాంక్ లాకర్లలోని వస్తువులను బట్టి బీమా ఇవ్వలేం: నిర్మలా సీతారామన్
బ్యాంక్ లాకర్లలో కస్టమర్లు దాచుకునే విలువైన వస్తువులను చూడటం లేదా నమోదు చేయడం బ్యాంకింగ్ నిబంధనలకు విరుద్ధమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బ్యాంక్ లాకర్లలో కస్టమర్లు దాచుకునే విలువైన వస్తువులను చూడటం లేదా నమోదు చేయడం బ్యాంకింగ్ నిబంధనలకు విరుద్ధమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అందువల్ల లాకర్లలోని వస్తువుల విలువ ఆధారంగా వేర్వేరు బీమా కవరేజ్‌లు కల్పించడం ఆచరణలో సాధ్యం కాదని ఆమె తేల్చిచెప్పారు. సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎంపీ (గడ్చిరోలి-చిమూర్) నామ్‌దేవ్ దాసరామ్ కిర్సాన్ అడిగిన ఓ అనుబంధ ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కస్టమర్లు తమ లాకర్లలో ఏం పెడుతున్నారో బ్యాంకులు కూర్చుని చూడటం వారి గోప్యతను, బ్యాంకింగ్ రూల్స్‌ను ఉల్లంఘించడమే అవుతుందన్నారు.
లాకర్లలోని వస్తువులను బ్యాంకులు పరిశీలించడం, వాటి విలువను అంచనా వేయడం సాధ్యం కాదు కాబట్టి, ప్రస్తుతం ఏవైనా నష్టాలు (లాకర్ పగలడం తదితర కారణాలు) జరిగితే.. లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్లు పరిహారంగా (స్టాండర్డ్ బీమా కవరేజ్) చెల్లిస్తున్నట్లు మంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతానికి ఈ విధానంలో ఎలాంటి మార్పులు చేసే ప్రతిపాదనలేవీ తమ ముందు లేవని ఆమె సభకు వివరించారు.






