Nirmala Sitharaman: మూడో త్రైమాసికంలో జీడీపీ పుంజుకుంటుంది: నిర్మల సీతారామన్

by Maddikunta Saikiran |
Nirmala Sitharaman: మూడో త్రైమాసికంలో జీడీపీ పుంజుకుంటుంది: నిర్మల సీతారామన్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2024-25) రెండో త్రైమాసికం(Q2FY25)లో దేశ జీడీపీ(GDP) తగ్గిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వ్యయం తగ్గడం, దేశవ్యాప్తంగా వినియోగం బలహీనంగా ఉండటం, కీలక పరిశ్రమలపై నెగిటివ్ వాతావరణ ప్రభావం కారణంగా జులై-సెప్టెంబర్(July-September) మధ్య దేశ జీడీపీ 5.4 శాతానికి తగ్గింది. కాగా గతేడాది ఇదే సమయంలో జీడీపీ 8.1 శాతంగా నమోదైంది. జీడీపీ తగ్గినప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇండియా ఫస్ట్ ప్లేస్(First Place)లో ఉండటం విశేషం.

ఇదిలా ఉంటే రెండో త్రైమాసికంలో జీడీపీ తగ్గిన విషయంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి(Union Finance Minister) నిర్మల సీతారామన్(Nirmala Sitharaman) స్పందించింది. మహారాష్ట్ర(MH), జార్ఖండ్(Jharkhand) ఎన్నికల నేపథ్యంలో ప్రజా, మూలధన వ్యయాలు తక్కువ ఉండటంతో రెండో త్రైమాసికంలో అభివృద్ధి మందగించిందని తెలిపారు. సెప్టెంబర్(September)తో ముగిసిన సెకండ్ క్వార్టర్(Second Quarter)లో జీడీపీ గణాంకాలు(GDP Statistics) తగ్గడం వ్యవస్థాగత మందగమనాన్ని సూచించవని పేర్కొన్నారు. మూడో త్రైమాసికం(Q3)లో దేశ ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకుంటుందని, రాబోయే రోజుల్లో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్ధిక వ్యవస్థగా(Economic System) ఇండియా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed