Nirav modi: నీరవ్ మోడీకి మరో షాక్.. బెయిల్ పిటిషన్ తిరస్కరించిన యూకే కోర్టు

by B.Srinivas |

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో పరారీలో ఉన్న నీరవ్ మోడీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను లండన్ కోర్టు తిరస్కరించింది.

Nirav modi: నీరవ్ మోడీకి మరో షాక్.. బెయిల్ పిటిషన్ తిరస్కరించిన యూకే కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Panjab national bank) కుంభకోణం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ (Nirav modi) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను లండన్ కోర్టు (London court) మరోసారి తిరస్కరించింది. తనను భారత్‌కు అప్పగించే వరకు బెయిల్‌పై విడుదల చేయాలని నీరవ్ దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టేసింది. ఈ కేసులో నీరవ్ చేసిన విజ్ఞప్తికి న్యాయస్థానం అంగీకరించలేదు. నీరవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడం ఇది పదోసారి కావడం గమనార్హం. దీంతో నీరవ్ మోడీ భారత్‌కు రప్పించడానికి దాదాపు మార్గం సుగమం అయినట్టేనని పలువురు భావిస్తున్నారు.

కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నీరవ్ మోడీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అతను 2018 లో భారత్ నుంచి పారిపోయారు. స్కామ్ బయటపడిన తర్వాత 2019 లో ఆయనను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఆయనను భారత్ కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా నీరవ్ ను అప్పగించేందుకు బ్రిటన్ అంగీకరించింది. అయితే ఆయన ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ న్యాయస్థానంలో అప్పీల్ చేస్తున్నాడు. అయినప్పటికీ నీరవ్ కు ఊరట లభించడం లేదు.

Next Story