- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిఫా వైరస్ కలకలం.. 6 జిల్లాల్లో హై అలర్ట్
నిఫా వైరస్ (Nipah Virus) మళ్లీ కలవరపెడుతోంది. కేరళలో తాజాగా మరొకరు నిఫా లక్షణాలతో మరణించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

దిశ, వెబ్‌డెస్క్: నిఫా వైరస్ (Nipha Virus) మళ్లీ కలవరపెడుతోంది. కేరళలో తాజాగా మరొకరు నిఫా లక్షణాలతో మరణించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు భావిస్తోన్న ఆరు జిల్లాల్లో అధికారులు హై అలర్ట్ (High Alert in Kerala) ప్రకటించారు. జులై 12న పాలక్కాడ్ జిల్లాకు చెందిన 57 ఏళ్ల వ్యక్తి నిఫా లక్షణాలతో మరణించగా.. మృతుల సంఖ్య రెండుకు చేరుకుంది. అతని మరణానికి గల కారణాలపై పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్థారణ చేయాల్సి ఉంది.
మృతుడు జ్వరం, ఇతర లక్షణాలతో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా.. మంజేరి మెడికల్ కాలేజీలో చేసిన వైద్య పరీక్షల్లో నిఫా పాజిటివ్ గా వచ్చినట్లు ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం. మృతుడితోసంబంధం కలిగిన 46 మంది లిస్టును సిద్ధం చేశారు. పాలక్కాడ్, మలప్పురం జిల్లాల ప్రజలు అత్యవసరమైతే తప్ప పబ్లిక్ ప్లేసుల్లో తిరగవద్దని కోరారు. కోజికోడ్, కన్నూర్, వయనాడ్, త్రిస్సూర్ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. జ్వరం, తీవ్ర తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు, గొంతునొప్పి, విరేచనాలు మొదలైన లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని, కనీస జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.






