- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Saudi Arabia Accident: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది భారతీయుల మృతి
సౌదీ అరేబియాSaudi Arabiaలోని జిజాన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)చోటుచేసుకుంది. తొమ్మిది మంది భారత పౌరులు(Nine Indian citizens)మృతిచెందినట్లు జెడ్డాలోని ఇండియన్ కాన్సులేట్(Indian Consulate) ఓ ప్రకటనలో పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్ : సౌదీ అరేబియాSaudi Arabiaలోని జిజాన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)చోటుచేసుకుంది. తొమ్మిది మంది భారత పౌరులు(Nine Indian citizens)మృతిచెందినట్లు జెడ్డాలోని ఇండియన్ కాన్సులేట్(Indian Consulate) ఓ ప్రకటనలో పేర్కొంది. పలు దేశాలకు చెందిన కార్మికులు దక్షిణ ఓడరేవు నగరమైన జిజాన్‌లోని వారి వర్క్‌సైట్‌కు బస్సులో ప్రయాణిస్తుండగా, వారి బస్సు ట్రైలర్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది కార్మికులు ఉన్నారు.
మరణించిన 15 మందిలో తొమ్మిది మంది భారతీయులు కాగా, మిగిలిన ఆరుగురిలో నేపాల్ , ఘనాకు చెందిన ముగ్గురు చొప్పున ఉన్నారు. తెలంగాణకు చెందిన ఇద్దరు సహా 11 మంది కార్మికులు మోస్తరు నుంచి తీవ్ర గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రమాదంలో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన కపెలి రమేష్ (32) ఉన్నట్లుగా గుర్తించారు. అతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
మూడు నెలల క్రితం ఉపాధి కోసం రమేష్ సౌదీ అరేబియా వెళ్లగా అంతలోనే మృతి చెందడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని రగిల్చింది. బస్సులో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైన వారంతా ఉపాధి కోసం ఆ దేశానికి వెళ్లిన వారే కావడంతో వారు కుటుంబాలు విషాదానికి గురయ్యాయి. ప్రమాదంలో ఇబ్రహీం పట్నం వర్షకొండకు చెందిన జంగిని శ్రీనివాస్ కు ఛాతీలో గాయమవ్వగా, అరపల్లి శ్రీధర్, సల్కం అంకిత్ లకు గాయలవ్వగా వారిని ఆసుపత్రికి తరలించారు.
జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి అక్కడ దుర్భర పరిస్థితుల మధ్య పనిచేస్తుండటమే కాకుండా తరుచు ప్రమాదాల బారిన పడుతు ప్రాణాలు కోల్పోతున్న భారతీయులు తమ కుటుంబాలకు చివరకు విషాదాన్ని మిగిలిస్తున్నారు. వారి మృతదేహాలనైన సకాలంలో తమకు అందించి కడసారి చూపుకు అవకాశం కల్పించి తమ కుటుంబాలను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.






