- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nimisha Priya: నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా
ఆఖరి క్షణాల్లో స్థానిక అధికారులు ఈ ప్రక్రియను నిలిపేసినట్టు తెలుస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: యెమెన్‌లో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియకు ఊరట లభించింది. యెమెన్ అధికారులు మంగళవారం వాయిదా వేసినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. బుధవారం మరణశిక్ష పడాల్సి ఉండగా, ఆఖరి క్షణాల్లో స్థానిక అధికారులు ఈ ప్రక్రియను నిలిపేసినట్టు తెలుస్తోంది. ఈ కేసు ప్రారంభం నుంచి ఈ విషయంలో అన్ని విధాలుగా సహాయం అందిస్తున్న భారత ప్రభుత్వం, ఇటీవల రెండు కుటుంబాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చేరుకోవడానికి మరింత సమయం కోరుతూ చేసిన ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత అధికారులు స్థానిక జైలు అధికారులు, యెమెన్‌లోని ప్రాసిక్యూటర్ కార్యాలయంతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపడం వల్లనే వాయిదాకు దోహదపడింది. దీనికి సంబంధించి భారత విదేశాంగ శాఖ.. ఈ కేసులో శిక్ష ఖరారు అయినప్పటి నుంచి నిమిష ప్రియను మరణశిక్ష నుంచి తప్పించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నిమిష కుటుంబంతో బాధిత కుటుంబం పరస్పరం ఒక అంగీకారానికి వచ్చేలా, కేసును పరిష్కరించుకునేందుకు సమయం ఇవ్వడానికి ప్రయత్నాలు జరిగాయి. ప్రాసిక్యూటర్ ఆఫీసు, స్థానిక జైలు అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిగాయి. వాటి ఫలితంగానే ఉరిశిక్ష వాయిదా వేయడానికి యెమెన్ అధికారులు అంగీకరించారని పేర్కొంది. తాజాగా ఈ కేసులో బాధిత కుతుంబం బ్లడ్‌మనీ అంగీకరించేలా ఒప్పంచడానికి మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చర్చలు సానుకూలంగా మారినట్టు తెలుస్తోంది. బాధిత కుటుంబం ఇందుకు అంగీకరిస్తే నిమిష ప్రియకు పూర్తిగా ఉరిశిక్ష నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి.






