నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదు.. కేంద్ర విదేశాంగ శాఖ కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

యెమెన్‌ (Yemen) దేశంలో భారత నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) ఉరిశిక్ష వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదు.. కేంద్ర విదేశాంగ శాఖ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: యెమెన్‌ (Yemen) దేశంలో భారత నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) ఉరిశిక్ష వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అయితే, ఇవాళ ఉదయం నుంచి నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు అయినట్లుగా సోషల్ మీడియాతో పాటు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. భారత గ్రాండ్‌ ముఫ్తీ సున్నీ లీడర్‌ అబూబకర్‌ ముస్లియార్‌ కార్యాలయం నుంచి సోమవారం అర్ధరాత్రి ఉరిశిక్ష రద్దు అయినట్లుగా అధికారిక ప్రకటన వెలువడినట్లుగా వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే మీడియాలో వస్తున్న వార్తలపై భారత విదేశాంగ శాఖ (Ministry of External Affairs of India) అధికారులు కీలక ప్రకటన చేశారు. నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదని వెల్లడించారు. ఈ పరిణామంతో ఉరిశిక్ష రద్దుపై ఏం జరగుతోందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Next Story