- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nidhi Tewari: ప్రధాని మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ.. ఆమె ఎవరంటే?
ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi)కి పీఎస్ (ప్రైవేట్ సెక్రటరీగా)గా ఐఏఎస్ అధికారిణి (IFS Nidhi Tewari) నిధి తివారీ నియామకం అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi)కి పీఎస్ (ప్రైవేట్ సెక్రటరీగా)గా ఐఏఎస్ అధికారిణి (IFS Nidhi Tewari) నిధి తివారీ నియామకం అయ్యారు. ఈ మేరకు తాజాగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమె నియామకాన్ని ఆమోదించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐఎఫ్ఎస్ అధికారి నిధి తివారి ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
ఆమె ఎవరంటే?
2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అయిన నిధి తివారీ, 2023 జనవరి నుంచి పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్నారు. అంతకు ముందు విదేశాంగ మంత్రిత్వ శాఖలోని, ఆమె అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో పనిచేశారు. అంతర్జాతీయ సంబంధాలలో ఆమెకు ఉన్న అనుభవం నేపథ్యంలో ప్రధాని కార్యాలయంలో కీలక పాత్ర పోషించడానికి వీలు కలిగింది. భారత్ వేదికగా గతంలో నిర్వహించిన జీ 20 సదస్సు సమయంలోనూ ఆమె కీలక పాత్ర పోషించినట్లు కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. నిధి తివారీ వారణాసిలోని మహ్మూర్‌గంజ్‌కు చెందినవారు. నిధి 2013లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో 96వ ర్యాంక్ సాధించారు. యూపీఎస్సీ ఉత్తీర్ణత సాధించడానికి ముందు, ఆమె వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్ (కమర్షియల్ టాక్స్)గా పనిచేశారు.






