పహల్‌గామ్ ఉగ్రదాడి కేసులో నేడు ఎన్‌ఐఏ చార్జిషీట్ దాఖలు

by Malleboina Mahesh |

ఈ సంవత్సరం ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్ సమీపంలోని బైసరన్ అనే ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో సుమారు 26 మందికి పైగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

పహల్‌గామ్ ఉగ్రదాడి కేసులో నేడు ఎన్‌ఐఏ చార్జిషీట్ దాఖలు
X

దిశ, వెబ్ డెస్క్: ఈ సంవత్సరం ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్ సమీపంలోని బైసరన్ అనే ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో సుమారు 26 మందికి పైగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని, ఆగ్రహాన్ని కలిగించిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం ఉగ్రవాదులను పెంచి పోషించిన పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అనంతరం దాడిని విచారించేందుకు ఎన్ఐఏకు బాధ్యతలు అప్పగించారు. దాదాపు 8 నెలల విచారణ తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఈ రోజు జమ్మూలోని ప్రత్యేక NIA కోర్టు ముందు పహల్‌గామ్ ఉగ్రదాడి కేసులో చార్జిషీట్‌ను దాఖలు చేయనుంది. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, కుట్రదారుల పాత్ర, సాక్ష్యాలను పొందుపరుస్తూ NIA ఈ చార్జిషీట్‌ను సమర్పించనుంది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా NIA ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి, ఈ దాడి వెనుక ఉన్న ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు కృషి చేసింది. ఈ చార్జిషీట్ దాఖలు చేయడం ఈ కేసులో కీలక పరిణామం గా భావిస్తున్నారు. పహల్‌గామ్ ప్రాంతంలో జరిగిన ఈ ఉగ్రదాడి దేశ భద్రతకు సంబంధించిన తీవ్రమైన అంశం కావడంతో, NIA దీనిపై లోతైన దర్యాప్తు జరిపింది. ఈ చార్జిషీట్ ద్వారా ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు, వారికి సహాయం చేసిన స్థానిక లేదా అంతర్జాతీయ వ్యక్తుల పాత్ర, ఈ కుట్ర వెనుక గల కారణాలు వంటి పూర్తి సమాచారం కోర్టుకు సమర్పించబడుతుందని భావిస్తున్నారు. ప్రత్యేక కోర్టులో ఈ చార్జిషీట్ దాఖలైన తర్వాత, కేసు విచారణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుంది.

Next Story