- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NIA: పాక్‌కు గూఢచర్యం.. ఢిల్లీలో సీఆర్‌పీఎఫ్ జవాన్ అరెస్ట్
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఓ సీఆర్‌పీఎఫ్ జవాన్‌ను సోమవారం అరెస్ట్ చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఓ సీఆర్‌పీఎఫ్ జవాన్‌ను సోమవారం అరెస్ట్ చేసింది. మోతీ రామ్ జాట్ అనే సైనికుడిని ఢిల్లీలో అదుపులోకి తీసుకుంది. దేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్ ఇంటలిజెన్స్ అధికారులతో పంచుకున్నాడని గుర్తించారు. 2023 నుంచి ఆయన ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విచారణలో తేలింది. దీనికి గాను పాక్ నుంచి వివిధ మార్గాల్లో్ నిధులు అందుతున్నాయని ఎన్ఐఏ తెలిపింది. అరెస్ట్ చేసిన అనంతరం మోతీ రామ్‌ను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు (Patiyala house court) లో హాజరుపర్చగా జూన్ 6 వరకు కస్టడీ విధించింది. ప్రస్తుతం ఎన్ఐఏ ఆయనను విచారిస్తోంది. నిందితుడితో ఇంకా ఎవరెవరు సంబంధాలు కలిగి ఉన్నారో తెలుసుకోవడానికి ఏజెన్సీ ప్రయత్నిస్తోంది.
కాగా, ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) అనంతరం పాక్ నిఘా సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే, పంజాబ్, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో 19 మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ఈ నెల 24న కచ్‌కు చెందిన సహదేవ్ సింగ్ గోహిల్ అనే వ్యక్తిని గుజరాత్ ఏటీఎస్ అరెస్టు చేసింది.






