ఎన్‌ఐఏ దూకుడు.. జమ్మూ కాశ్మీర్‌లో 32 ప్రాంతాల్లో సోదాలు

by Malleboina Mahesh |

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం టెర్రరిస్టులపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఐబీ సమాచారంతో ఉగ్రవాదుల జాడలను కనిపెట్టి.. హతమారుస్తున్న సంగతి తెలిసిందే.

ఎన్‌ఐఏ దూకుడు.. జమ్మూ కాశ్మీర్‌లో 32 ప్రాంతాల్లో సోదాలు
X

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం టెర్రరిస్టులపై భారత ప్రభుత్వం (Government of India) ఉక్కుపాదం మోపుతోంది. ఐబీ సమాచారంతో ఉగ్రవాదుల (Terrorists) జాడలను కనిపెట్టి.. హతమారుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోదాలు జమ్మూ, కశ్మీర్ ప్రాంతాల్లో కంటిన్యూ గా సోదాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం నుంచి కాశ్మీర్‌లో 32 ప్రాంతాల్లో సోదాలు కొనసాగిస్తుంది. ఈ సోదాల్లో ఉగ్రవాద సంబంధిత కేసులకు సంబంధించినవని, ప్రత్యేకించి ఓవర్‌గ్రౌండ్ వర్కర్స్ (OGWs) , ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వారిపై దృష్టి సారించిందని తెలుస్తోంది.

ఇవి.. షోపియాన్, కుల్గామ్, పుల్వామా, సోపోర్, కుప్వారా, బారాముల్లా వంటి జిల్లాలో జరుగుతున్నాయి. 2022 లో నమోదైన ఒక కేసుకు సంబంధించిన లష్కర్-ఎ-తోయిబా (LeT), జైష్-ఎ-మహ్మద్ (JeM) వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వారి కదలికలు ఉన్నట్లు సమాచారం రావడంతో ఎన్ఐఏ ఈ సెర్చింగ్ ఆపరేషన్ (Searching operation) చేస్తుంది. ఎన్‌ఐఏ జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రతరం చేసిన భారత ప్రభుత్వం.. సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదులకు లాజిస్టికల్ సహాయం అందించే వారిపై దృష్టి సారించిందని స్పష్టమవుతోంది.

Next Story