ఎక్స్‌ప్లోజివ్స్ దొంగతనంపై ఎన్ఐఏ విచారణ.. నక్సలైట్లపై అనుమానం!

by Phanindra |

ఒడిశాలో భారీ స్థాయిలో ఎక్స్‌ప్లోజివ్స్ దొంగతనం జరిగింది. దీని వెనుక నక్సలైట్లు ఉన్నారనే అనుమానంతో ఎన్ఐఏ విచారణ చేపట్టింది.

ఎక్స్‌ప్లోజివ్స్ దొంగతనంపై ఎన్ఐఏ విచారణ.. నక్సలైట్లపై అనుమానం!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో కమర్షియల్ పేలుడు పదార్థాల దొంగతనం కేసులో జాతీయ దర్యా్ప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ ప్రారంభించింది. ఈ ఎక్స్‌ప్లోజివ్స్‌ను నక్సలైట్లు దొంగిలించినట్లు అనుమానాలు ఉండటంతోనే ఎన్ఐఏ రంగంలోకి దిగినట్లు సమాచారం. భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్న వాహనంపై కొందరు దుండగులు దాడి చేశారని, ఎక్స్‌ప్లోజివ్స్ తీసుకొని దగ్గరలోని అడవిలోకి పారిపోయారని సమాచారం. దొంగతనం చేసే సమయంలో వారి చేతుల్లో కూడా ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story